E-Paper
Advertisement

విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !
Advertisement

Vishwambhara Update:బింబిసార సినిమాతో అటు కళ్యాణ్ రామ్ కి ,ఇటు ఇండస్ట్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన వశిష్ట చిరుతో విశ్వంభర సినిమాని చేస్తున్నాడు అనగానే ఇండస్ట్రీ ఒక్కసారిగా అలెర్ట్ అయిపొయింది.ఇక ఈ సినిమా సోషియో ఫాంటసీ అవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మరోసారి చిరు ఆ జానర్ లో సినిమా చేస్తున్నాడు అనగానే బాస్ నుండి మరోసారి సరికొత్త సినిమా రాబోతుంది అని మురిసిపోయారు మెగా ఫ్యాన్స్.అయితే సినిమా మొదలవడంతో ఎక్కడ లేని హైప్ వచ్చేసింది.

సినిమా ఇప్పట్లో వస్తుందా రాదా

మొదలవడం అయితే అయింది కానీ సినిమా ఇదిగో అప్పుడు వస్తుంది,ఇప్పుడు వస్తుంది అంటూ ఊరించడమే తప్ప ఎప్పుడొస్తుందో క్లారిటీ గా చెప్పలేకపోవడంతో సినిమాపై ఉన్న అంచనాలన్నీ ఒక్కసారిగా ఆవిరైన పరిస్థితి.ఇక చిరు ఆ మధ్య మాట్లాడుతూ జులైలో పక్కాగా రావొచ్చు అన్న హింట్ ఇచ్చినప్పటికీ జులై,ఆగస్ట్ దాటి సెప్టెంబర్ లోకి అడుగుపెడుతున్నప్పటికీ ఇంకా సినిమా నుండి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో అసలు సినిమా ఇప్పట్లో వస్తుందా రాదా అన్న అనుమానాలు మొదలైపోయాయి.

బాస్ బర్త్ డే రోజున సాలిడ్ అప్ డేట్ 

Advertisement

మరో వైపు ఇంకో ఆగస్ట్ 22 న చిరు బర్త్ డే వస్తుంది.దానికోసం బాబీ చిరుల మెగా 158 సినిమా సాలిడ్ అప్ డేట్ ఇచ్చేందుకు ఇప్పటి నుండే తెగ ప్రిపరేషన్స్ చేస్తుంటే విశ్వంభర నుండి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని కలవరపెట్టేస్తుంది.

దీంతో మేకర్స్ యొక్క వాలకం చూస్తుంటే ఈ సినిమాని ఈ ఏడు కూడా రిలీజ్ చేసే అవకాశం లేనట్టేనా అంటూ లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా సినిమాపై సాలిడ్ అప్ డేట్ వస్తుందా అన్న చిన్న ఆశ అయితే అందరిలో కనిపిస్తుంది.

వచ్చే ఏడు కి పోస్ట్ పోన్ చేస్తారా?

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.చిరు- కీరవాణి కాంబోలో ఇది నాలుగో చిత్రం కావడం విశేషం.ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సురభి,హర్షవర్ధన్,వెన్నెల కిశోర్, ప్రవీణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ALSO READ :మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

మరి ఈసారి అయినా ఇదిగో పక్కా ఈ డేట్ న వస్తుంది అని బల్ల గుద్ది డేట్ అనౌన్స్ చేస్తారా లేక VFX సాకు చెప్పి వచ్చే ఏడు కి పోస్ట్ పోన్ చేస్తారా అన్నది కాలమే డిసైడ్ చేయాలి!

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×