E-Paper
Advertisement

పెళ్లికి సిద్ధమైన ఎక్స్ ప్రెస్ హరి.. వధువు ఎవరంటే?

పెళ్లికి సిద్ధమైన ఎక్స్ ప్రెస్ హరి.. వధువు ఎవరంటే?
Advertisement

Express Hari: ‘పటాస్’ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు స్టాండప్ కమెడియన్ హరి (Express Hari). ఇందులో ఎక్స్ ప్రెస్ హరిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఆదివారం విత్ స్టార్ మా పరివార్’ కార్యక్రమంలో శ్రీముఖి(Sree Mukhi), అవినాష్ (Avinash) లతో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బుల్లితెర కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన తాజాగా కొత్త ఇంటిని కూడా నిర్మించుకున్న విషయం తెలిసిందే. పైగా పలువురు బుల్లితెర సెలబ్రిటీల సమక్షంలో బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు.

పెళ్లి పీటలు ఎక్కనున్న ఎక్స్ప్రెస్ హరి..

అలాంటి ఈయన ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు. పైగా తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా రివీల్ చేయడంతో అందరూ అప్పుడే హరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఎప్పుడూ తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకునే హరి ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. మరి హరి వివాహం చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం రీసెంట్గా 200కు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా 200 ప్లస్ సెలబ్రేషన్స్ పేరిట గ్రాండ్గా ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో ఎక్స్ప్రెస్ హరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి రివీల్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ ప్రోమోలో అసలు విషయం బయటకు..

Advertisement

లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమోలో సీరియల్ సెలబ్రిటీలు సందడి చేశారు. బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇదే వేదికపై హోస్ట్ శ్రీముఖి మాట్లాడుతూ..” ఈ 200 ప్లస్ ఎపిసోడ్ల సందర్భంగా ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మన ఎక్స్ప్రెస్ హరి ఒక ఇంటివాడు కాబోతున్నాడు” అంటూ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది శ్రీముఖి. ఈ సమయంలో హరి ముఖంలో సిగ్గు మొగ్గ లేసింది. పైగా ఆ అమ్మాయిని కూడా ఈ షో కి తీసుకొచ్చినట్లు ప్రోమోలో చూపించారు. పల్లకిలో ఆమెకు పూర్తిగా రెడ్ కలర్ క్లాత్ కప్పి మోసుకుంటూ వచ్చినట్లు చూపించారు.

also read:‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

ఆ అమ్మాయి ఎవరంటే?

Advertisement

శ్రీముఖి మాట్లాడుతూ..” మా హరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి అని తెలిసింది” అంటూ అమ్మాయి ముఖం మీద ఉన్న పరదా తీస్తుండగానే ప్రోమో కట్ చేశారు. మొత్తానికి అయితే ఎక్స్ప్రెస్ సరి ఒక ఇంటివాడు కాబోతున్నాడని, పైగా ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇండస్ట్రీ అమ్మాయి అని తెలిసి అభిమానులు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంటే వచ్చే ఆదివారం జియో హాట్ స్టార్, స్టార్ మా చానల్స్ లో ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×