E-Paper
Advertisement

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?
Advertisement

Ramcharan RC17: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండో చిత్రం నేడు అధికారక లాంఛనాలతో ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇలా రామ్ చరణ్ (Ram Charan) సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పుడే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా పూజ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఒక కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కురుక్షేత్రంలో కృష్ణుడిలా..

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో భాగంగా నెమలి పించం వెనుక చరణ్ మొఖం కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం కృష్ణుడి రెఫెరెన్స్ గా ఈ సినిమా ఉండబోతుందని, ఈ సినిమా ఒక వైవిద్య భరితమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. నెమలి పించం కాన్సెప్ట్ తో ఈ పోస్టర్ విడుదల చేయడంతో చరణ్ ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆ కృష్ణుడి పాత్ర బృందావనంలో కృష్ణుడు లాగా ఉంటుందా లేదంటే కురుక్షేత్రంలో విశ్వరూపం చూపించే కృష్ణుడిలా ఉండబోతుందా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మైథాలజికల్ టచ్ ఇవ్వబోతున్న సుక్కు..

Advertisement

ఇలా ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా స్టోరీ పై కూడా చర్చలు మొదలయ్యాయి అయితే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఇందులో మైథాలజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం.ఈ భారీ ప్రాజెక్టులో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమా సంగీత దర్శకుడికి సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

RC 17 కి దూరంగా దేవిశ్రీ..

సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే అయితే ప్రస్తుతం ఈయన హీరోగా బిజీ అవుతున్న నేపథ్యంలో ఆర్ సి 17 కోసం కొత్త సంగీత దర్శకుడు రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. ఇప్పటికే అనిరుద్ రవిచంద్రన్ పేరు తెరపైకి వచ్చింది ఈయనతో పాటు శాశ్వత్ సచ్ దేవ్ పేరు కూడా వినపడుతున్న సంగతి తెలిసిందే.మరి ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఎవరు రంగంలోకి దిగబోతున్నారు అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ భారీ ప్రాజెక్టును సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Also Read:రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!

Related News

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

Big Stories

Advertisement
×