Shivathmika Rajashekar:సినిమా షూటింగ్ టైమ్ లో తీసుకున్న ఫొటోలను, హ్యాపీ మూమెంట్స్ ని హీరోయిన్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారన్న సంగతి తెల్సిందే. ఇక ఇదే కోవలో తాజాగా హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ కూడా ఇలాగే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి ఫాలోవర్స్ ని ఫిదా చేసింది.
‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది.ఇక ఈ ముద్దుగుమ్మ నెట్టింట పోస్ట్ ఇలా వదలడంతో వన్ అండ్ ఓన్లీ శివాత్మిక రాజశేఖర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్.
శివాత్మిక తన పోస్ట్‌లో.. మరో 18 రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతోందని చెబుతూ, థాయ్‌లాండ్‌లోని కో చాంగ్‌లో గడిపిన రోజులని గుర్తు చేసుకుంటూ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు.. సినిమాలో తాను చేసిన కీర్తన పాత్ర గురించి స్పందిస్తూ ‘నాకు కీర్తన పాత్ర ఎంత ఇష్టమో.. మీకు కూడా అంతే నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అంటూ తన మనసులో మాట చెప్పేసింది.
2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయిందన్న సంగతి తెల్సిందే. నలుగురు స్నేహితుల మధ్య జరిగే హ్యాపీ మూమెంట్స్, ఫ్రెండ్‌షిప్,లవ్ ,కామెడీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్, అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు అంతగా వసూల్లని రాబట్టలేకపోయినా
ఆ తర్వాత టీవీల్లో, ఓటీటీలో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.అలా మెల్లి మెల్లిగా కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ సినిమా.
ఇక ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా ‘ENE Repeat’ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించనుండగా , వీరితో పాటు శివాత్మిక రాజశేఖర్, అనీషా అంబ్రోస్ కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా కీర్తన పాత్రలో శివాత్మిక కనిపించనుండటంతో ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారనడం లో సందేహం లేదు ..
ఇక శివాత్మిక విషయానికి వస్తే.. రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన ఆమె మొదటిసారిగా దొరసాని అనే సినిమాతో పలకరించిన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత ఆ స్థాయి సినిమాని పట్టుకోలేకపోయిందనే చెప్పాలి.చూడాలి మరి క్రేజీగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ని పట్టేసిన శివాత్మిక ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
మొత్తానికి శివాత్మిక పెట్టిన ఈ చిన్న పోస్ట్‌తో ‘ENE Repeat’పై మరోసారి సోషల్ మీడియాలో డిబేట్ మొదలైపోయింది.మరి మొదటి సినిమాలాగే ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుందా? కీర్తనగా శివాత్మిక ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అన్నది నవంబర్ 19న తేలిపోనుంది !
ALSO READ :ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!