E-Paper
Advertisement

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!
Advertisement

Hospital Charges: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు, డయాగ్నొస్టిక్ ల్యాబ్ ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. వైద్యం అందించడం సామాజిక బాధ్యత అన్న విషయాన్ని పక్కన పెట్టి రోగుల భయాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ జ్వరం, దగ్గు, కడుపునొప్పి వంటి చిన్నపాటి సమస్యలకు సైతం కొండంత బిల్లులు వేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు.కన్సల్టేషన్ ఫీజు పేరుతో మొదలయ్యే వసూళ్ల పర్వం అవసరం లేకపోయినా రాసే రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, అనేక స్కానింగ్ల తో తడిసి మోపెడవుతోంది. రోగిని చేర్చుకునే ముందు అయ్యే ఖర్చుల వివరాలను పారదర్శకంగా వెల్లడించకపోవడం డిశ్చార్జ్ సమయంలో భారీ బిల్లులు చేతుల్లో పెట్టి వేధించడం పరిపాటిగా మారుతుంది.

ప్రాణాలు పోతే లక్షల్లో సెటిల్మెంట్లు

గత రెండేళ్లలో నాగర్ కర్నూల్ గద్వాల జిల్లా కేంద్రాలలోని పలు హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగులు మృతి చెందుతే బాధితుల ఆందోళనలతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లక్షల్లో నష్టపరహారం సర్దుబాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగినా బాధ్యతాయుతంగా కఠినమైన చర్యలు తీసుకోకుండా సెటిల్మెంట్లు చేసుకోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలకు భయం లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. అనుమతి లేని ల్యాబ్ లు, కమిషన్ల దందాలు,పలు డయాగ్నొస్టిక్ ల్యాబ్ లో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు.క్వాలిఫైడ్ టెక్నీషియన్లు లేకుండానే తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రులు, ల్యాబ్ ల మధ్య అంతర్గత కమిషన్ల ఒప్పందాల కారణంగా రోగులకు అనవసరమైన పరీక్షలు రాస్తూ వారిని ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నారు.

నిద్రమత్తులో వైద్య ఆరోగ్యశాఖ

Advertisement

టాస్క్ ఫోర్స్ అధికారులు క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు చేయడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడంతో పాటు ఫీజుల ప్రదర్శన వంటి అంశాలపై అధికారులు తనిఖీలు చేయడం లేదు.వెంటనే ప్రభుత్వం స్పందించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించాలని అనుమతి లేని ల్యాబ్లను సీజ్ చేయాలని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి ఉచిత వైద్య మందేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!

హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. రేపు ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×