E-Paper
Advertisement

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?
Advertisement

Ranya rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో.. కోట్లాది రూపాయల భారీ మోసం పేరుతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ, కస్టమ్స్ అధికారుల నిఘాలో ఉన్న కన్నడ హీరోయిన్ రన్యా రావు (Ranya rao) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన ఈమె కర్ణాటకలోని ప్రసిద్ధ హాసనాంబ దేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లి మరోసారి కొత్త వివాదంలో చిక్కుకుంది. ఇకపోతే ఆమె దేవుడి దర్శనం చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. అక్కడ ఆలయ అధికారులు ఆమెకు అందించిన రాజ మర్యాదలు, విఐపి ప్రోటోకాల్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న ఈమెకు దేవాలయంలో ప్రత్యేక మర్యాదలు కల్పించడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అధికారులపై నెటిజన్స్ ఫైర్..

రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి.. ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చింది రన్యా రావు. తన తండ్రి ( ఐఏఎస్ అధికారి రామచంద్రారావు) , కుటుంబ సభ్యులతో కలసి హాసనాంబ దేవి దర్శనానికి వచ్చారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే.. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రభుత్వ విఐపి ప్రోటోకాల్ వాహనంలో తీసుకెళ్లి.. నేరుగా గర్భగుడికి పంపి ప్రత్యేక పూజలు నిర్వహించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రత్యేక మర్యాదలపై మండిపాటు..

Advertisement

ముఖ్యంగా రన్యారావుకి ప్రత్యేక హోదా కల్పిస్తూ దర్శనం కల్పించిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కోట్ల రూపాయల స్మగ్లింగ్ కేసులో నిందితురాలుగా ఉన్న వ్యక్తికి అంత మర్యాద అవసరమా? విఐపి ప్రోటోకాల్ వాహనంలో తీసుకెళ్లి మరీ దర్శనం చేయించాల్సిన అవసరం ఏముంది? అధికారుల హోదాను, పవర్ ను ఉపయోగించి ఇలాంటి సౌకర్యాలు పొందడం ఏంటి ? అంటూ అధికారుల పై కూడా భక్తులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు ఒకన్యాయం, నేరారోపణలు అందుకుంటున్న పెద్దలకు ఒక న్యాయమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రన్యా రావు మరోసారి వార్తల్లో నిలవడం గమనార్హం.

also read: మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

రన్యారావు కెరియర్..

Advertisement

రన్యారావు విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు, దర్శకుడైన సుదీప్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం మాణిక్యతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో మానస అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నటించడానికి ముందు మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈమె.. తమిళ్ మొదటి చిత్రం విక్రమ్ ప్రభు సరసన నటించిన వాఘా. ఇలా ఈమె నటించింది కేవలం రెండు మూడు చిత్రాలతో నైనా నటిగా కంటే కూడా స్మగ్లింగ్ కేసుతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకుంది అని చెప్పవచ్చు. మరి ఈ రాజా మర్యాదలపై అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

Related News

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్..పోస్ట్ వైరల్!

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×