E-Paper
Advertisement

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Jyothi Poorvaj:జ్యోతి పూర్వాజ్…గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న ఈ వెటరన్ బ్యూటీ తాజాగా కిల్లర్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇలా ఇండస్ట్రీలో ఎదుర్కున్న అనుభవాలు,కష్టాలు ,నేర్చుకున్న పాఠాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

తన జీవితాన్ని ఒక సినిమా టైటిల్‌తో పోల్చాల్సి వస్తే కన్నడలోని ‘బెంకి బెళ్లి అరళిద హూవు’ అనే టైటిల్‌ను ఎంచుకుంటానని జ్యోతి తెలిపారు. బెంకి అంటే నిప్పు అని, నిప్పులో వికసించిన పువ్వు అనే అర్థం వస్తుందని చెప్పారు. తన లైఫ్ జర్నీ కూడా అలాంటిదేనని తెలిపింది.బయటకు చూస్తే జీవితం బాగానే కనిపించినా, అందులో ఎన్నో కష్టాలు, బాధలు దాగి ఉన్నాయని చెప్పుకొచ్చింది.
తాను కోరుకున్నవన్నీ సులభంగా దక్కలేదని, జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని వాపోయింది.

Advertisement

ఇక నటిగా తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం, మంచి గుర్తింపు దక్కడం అదృష్టంగా భావిస్తానని , మొదటి నుంచి మంచి ఆఫర్లు వచ్చాయని, ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా లభించిందని తెలిపింది. అయితే కెరీర్ పరంగా అదృష్టం కలిసొచ్చినప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ సాఫీగా సాగలేదని మనసులోని బాధని బయటపెట్టింది. తన భర్త ద్వారా కూడా కొన్ని మంచి అవకాశాలు అందాయని, దేవుడి ఆశీస్సుల వల్లే ఇంతదూరం ప్రయాణించగలిగానని ఆనందాన్ని వ్యక్తం చేసింది.కళలకు అధిదేవత అయిన సరస్వతీ దేవికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటానని తెలిపింది.

ఇక సినిమా ఇండస్ట్రీలో మనకు నచ్చిన పాత్రలు వెతుక్కుంటూ రావని, వచ్చిన అవకాశాలను ఓడిసిపట్టుకోవాలని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది మనకు నచ్చిన పాత్రలు ఇతరుల నుంచి రాకపోతే, మనమే అలాంటి అవకాశాలను సృష్టించుకునే కెపాసిటీని పెంచుకోవాలని సూచించింది.ఒకవేళ తాను చేయాలనుకున్న పాత్ర మరొకరికి వెళ్లిపోయినా ఎప్పుడూ బాధపడలేదని, మనకు రాసిపెట్టి ఉంటే ఆ అవకాశం మన దగ్గరికే వస్తుందని, లేకపోతే మన కోసం మరో మంచి అవకాశం ఎదురుచూస్తుందని వేదాంతాన్ని వల్లె వేసింది.

Advertisement

ఇక ఇండస్ట్రీలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ‘ఓపిక’ అని, పని విషయంలో మరీ మంచిగా ఉండటం కూడా ఎప్పుడూ మంచిది కాదని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అతిగా అటిట్యూడ్ చూపించినా ఇబ్బందులు తప్పవని, ఎదుటి వ్యక్తులు, పరిస్థితులను బట్టి మన స్పందన ఉండాలని తెలిపింది.మొత్తానికి నటిగా తనకు మంచి అవకాశాలు, గుర్తింపు వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని జ్యోతి పూర్వాజ్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి!

ALSO READ :బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

Big Stories

Advertisement
×