E-Paper
Advertisement

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!
Advertisement

National Unity: భారతదేశంలోని భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యాలు జాతీయ ఐక్యతకు బలమైన పునాదులని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థాపన దినోత్సవాలను ఒకే వేదికపై నిర్వహించడం ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఆనందంగా ఉందన్నారు.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా..

ఆదివారం సాయంత్రం లోక్‌భవన్‌ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, తన సతీమణి జానకి శుక్లా తో కలిసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరాన్ని మినీ భారతంగా అభివర్ణించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తెలంగాణ ఎల్లప్పుడూ ఆప్యాయంగా ఆహ్వానిస్తోందని, సమ్మిళిత సంస్కృతి, పరస్పర సామరస్యంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

Advertisement

Also read: ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

బతుకమ్మ పండుగ..

భారతదేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని గవర్నర్‌ అన్నారు. అక్టోబర్‌ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని, నేడు వివిధ రాష్ట్రాల స్థాపన దినోత్సవాలను జరుపుకోవడం ద్వారా దేశ ఐక్యత నిదర్శనం అన్నారు.భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినా.. అన్ని రాష్ట్రాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వివరించారు.ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక చరిత్ర, భాష లు సాంస్కృతిక సంగమం దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి స్థిరపడిన ప్రజలు తమ సొంత సంప్రదాయాలను పాటిస్తూనే స్థానిక సంస్కృతులను కూడా ఆచరిస్తున్నారని చెప్పారు. రాజస్థాన్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రజలు తమ సంప్రదాయాలతో పాటు ఇక్కడి బతుకమ్మ వంటి పండుగలను కూడా జరుపుకోవడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

సమష్టి కృషితోనే వికసిత భారత్‌..

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌’ స్ఫూర్తితో వికసిత భారత్‌ దిశగా ముందుకు సాగాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరత, సమ్మిళిత అభివృద్ధి, మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్య, వ్యాపార రంగాల సాధికారత, మహిళా నాయకత్వం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సుపరిపాలన అందించడం అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు.సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం దేశ ప్రగతిలో భాగస్వామ్యమైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.నీటి సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని పరిస్థితుల్లో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రకృతి పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ , హోం శాఖ కార్యదర్శి శిఖా గోయల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. రేపు ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!

ఘట్‌కేసర్‌లో ఇద్దరు మైనర్ బాలురు మిస్సింగ్.. 3 గంటల్లో చేదించిన పోలీసులు!

మార్కేట్‌లో భగ్గుమంటున్న బియ్యం ధరలు.. ఒక క్వింటాల్‌కి ఏంతో తెలుసా..?

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 14 హోటళ్లు సీజ్.. పిస్తా హౌస్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లకు నోటీసులు!

Big Stories

Advertisement
×