Hyderabad Traffic: హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసారు పోలీసులు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు రేపు అమిత్ షా పాదయాత్ర చేయనున్నారు. దీంతో రేపు నవంబర్ 2న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. రేపు లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, ఎంజే మార్కెట్ పరిసరాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. దీంతో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర చేయనున్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు బీజేపీ పాదయాత్ర చేయనున్నారు. దీంతో పాదయాత్ర నేపథ్యంలో పలు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. బీజేఆర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు అమలు చేయనున్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లింపు చేయనున్నారు.
జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు మళ్లింపు, లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతి నిరాకరణతో హిమాయత్‌నగర్ వైపు మళ్లించనున్నారు. హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లించనున్నారు. బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బోగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లింపులు, ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. దీంతో పాటుగా జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.
లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం జంక్షన్లను తప్పించుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశం ఉందని నాంపల్లి, అబిడ్స్, రామకోటి, కోఠి, చాదర్‌ఘాట్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు చేసారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల మళ్లింపు చేయనున్నారు. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు తెలిపారు.
Also read: మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!