The Odyssey: హాలీవుడ్ లో మరో సరికొత్త విజువల్ వండర్ తో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు డైరెక్టర్ క్రిష్టఫర్ నోలన్ .ఈసారి గ్రీకు పురాణాలబ్యాక్ గ్రాఫ్ లో అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్ డ్రామాని మన ముందుకు తీసుకొస్తున్నాడు.ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచిన ది ఒడిస్సీ నుంచి కౌంట్ డౌన్ ట్రైలర్ పేరుతో ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనివర్సల్ పిక్చర్స్.ఇక ఈ ట్రైలర్ చూశాక సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి అనడంలో సందేహం లేదు.
గతంలో ‘ఇంటర్ స్టెల్లార్’, ‘ఇన్సెప్షన్’, ‘ఓపెన్‌హైమర్’ వంటి క్లాసిక్ ఫిలిమ్స్ తో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన నోలన్ ఈసారి ది ఒడిస్సీ తో మరో సంచలనానికి రంగం సిద్ధం చేసినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది .ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే గ్రీకు పురాణాల్లోని ప్రముఖ ఒడిస్సియస్ సాహస యాత్ర చుట్టూ తిరుగుతుంది.ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత, ఇథాకా రాజ్యానికి తపెద్ద ఆయన ఒడిసియన్ తిరిగి తన సొంత గడ్డకు, తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య వద్దకు చేరుకోవడానికి 10 ఏళ్లకు పైగా చేసిన ప్రమాదకర సముద్ర ప్రయాణమై ఈ సినిమా.
ఈ జర్నీలో ఎదురయ్యే భయంకర తుఫానులు, ఊహకు అందని వింత లోకాలు, ప్రాణాలు తీసే రాక్షసులతో చేసే పోరాటాలు మరియు యుద్ధ సన్నివేశాలను నోలన్ మార్క్ గ్రాండియర్‌తో ఈ ట్రైలర్‌లో కళ్ళకు కట్టినట్టు చూపించ్చాడు .నోలన్ మామూలుగా సినిమాల్లో విజయ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ వాడతాడు. వీల్లెనంత తవరకు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తోనే రియల్ లుక్ తీసుకొస్తాడు .ఈ సినిమాలో కూడా సముద్రపు తుఫానుల సీన్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ లో థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ఈ భారీ విజువల్ వండర్ లో ఒడిస్సియస్ పాత్రలో ద గ్రేట్ యాక్టర్ అన్నే హాత్వే నటించింది .గతంలో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఇంటర్ స్టెల్లార్ లో కలిసి నటించిన కాంబో మళ్లీ ఈ సినిమాలో కలిసి కనిపించడం ఇక్కడ విశేషం.
వీరితోపాటు టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా మరియు వెటరన్ నటి షార్లిజ్ థెరాన్ వంటి కాస్టింగ్ ఇందులో కీరోల్స్ పోషించారు .ఇంతటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఒకే ఫ్రేమ్ లో చూడమంటే మూవీ లవర్స్ కాదు పండగనే చెప్పాలి .ముఖ్యంగా రాబర్ట్ ప్యాటిన్సన్ టెనెట్ తర్వాత మళ్లీ నోలన్ దర్శకత్వం కనిపిస్తుండటంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.ఇక వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ విజువల్ ఫిస్ట్ ఈనెల 17న థియేటర్లోకి అడుగుపెట్టబోతుంది .
ఇక ఐమాక్స్ స్క్రీన్ లపై ఈ సినిమాను చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.ఇక నోలన్ గత సినిమాకి వస్తే గత ఏడాది జూలైలో రిలీజ్ అయిన ఓపెన్ హైమర్ ఆస్కార్ దక్కించుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది చూడాలి మరి తొలిసారిగా పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ ని ఎంచుకున్న నోలన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో !