Shivathmika Emotional Post:శివాత్మిక రాజశేఖర్ ..రాజశేఖర్,జీవితల కూతురిగా దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ కిడ్ ఎందుకనో ఆ తర్వాత ఆ జోష్ ని చూపించలేకపోయింది. అయితే తాజాగా తరుణ్ భాస్కర్ సినిమా ENE Repeatలో కీ రోల్ దక్కించుకోవడంతో ఇపుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది.ఇక ఈ సినిమా రేపే రిలీజ్ కాబోతుండటం తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రేజీ పోస్ట్ పెట్టేసింది శివాత్మిక.
మాములుగా సినిమా రిలీజ్ టైమ్‌లో స్టార్స్ సినిమా ప్రమోషన్స్ కోసం పోస్టులు పెడుతుంటారన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే శివాత్మిక కూడా సినిమా రిలీజ్ అని పోస్ట్ పెట్టేసింది. అయితే అందులో పబ్లిసిటీ కంటే తన మనసులోని అసలైన సంతోషమే ఎక్కువగా కనిపించడం విశేషం.ఈ సినిమాతో తన కల నిజమైందని, జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ ని సంపాదించుకున్నానని ఆమె ఎమోషనల్ అయిపోయింది ఈ అందాల భామ.
ఇక ఈ జర్నీలో తనకు ఎప్పటికీ తోడుండే మంచి స్నేహితులు దొరికారని, రేపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదు కానీ, తన ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో కలిసి పనిచేసే ఛాన్స్ రావడమే తనకు అన్నింటికంటే గొప్ప విషయమని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాలో శివాత్మిక ‘కీర్తన’ అనే పాత్రలో కనిపించబోతోందని తాను పెట్టిన పోస్ట్ ని చూస్తే అర్థమవుతుంది. కీర్తనను, ENE Repeat సినిమాను ఇక ఆడియన్స్ చేతుల్లో పెడుతున్నానని, సినిమాతో పాటు తన నటన కూడా అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ప్రతి శుక్రవారం కొత్త కథలతో ప్రేక్షకులను థియేటర్లలో కలుస్తూనే ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఈ అందాల భామ.
ఇక ఈ ENE Repeat విషయానికి వస్తే 2018లో వచ్చిన’ఈ నగరానికి ఏమైంది’సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా అప్పట్లో యూత్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో చెప్పక్కర్లేదు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డిల ఫ్రెండ్షిప్, వాళ్ల గోవా ట్రిప్, ఆ కామెడీకి ఇప్పటికీ ఆడియన్స్ లో ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది కూడా.
ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ సినిమా మీమ్స్, డైలాగ్స్ తెగ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.ఇక దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అదే అదే టీమ్ రిపీట్ అంటూ మరిసారి ఎంటర్ టైన్ మెంట్ ని రిపీట్ చేస్తుండటంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్,వివేక్ సాగర్ మ్యూజిక్ ఎంతలా కలిసి వచ్చాయో చెప్పక్కర్లేదు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటిలతో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాలో నటించనున్న సంగతి తెల్సిందే. మొత్తానికి రిలీజ్‌కు ముందే శివాత్మిక పెట్టిన ఈ పోస్ట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.చూడాలి మరి నవంబర్ 19న థియేటర్లలోకి రానున్న ENE Repeat ప్రేక్షకులను ఏ రేంజ్లో నవ్విస్తుందో, కీర్తనగా శివాత్మికకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో !
ALSO READ :ఒక్కో పాటతో ఒక్కో రేంజ్..యమునా తారక్ టాప్ సాంగ్స్ ఇవే!