Comedian Venu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారు ఉన్నారు. అసలు తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కమెడియన్ల వల్లే సూపర్ హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన కమెడియన్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.. బుల్లితెరపై కూడా జబర్దస్త్ (Jabardasth)లాంటి కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ వేణు (Comedian Venu)ఒకరు. జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన ప్రస్తుతం దర్శకుడుగా మారిపోయారు.
జబర్దస్త్ కమెడియన్ టు స్టార్ డైరెక్టర్..
ఇక జబర్దస్త్ కార్యక్రమంలో చేస్తూనే వెండితెర సినిమాలలో కమెడియన్ గా అవకాశాలు అందుకున్నారు. అనంతరం డైరెక్టర్ గా మారి బలగం (Balagam)అనే సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వేణు తదుపరి ఎల్లమ్మ (Yellamma) అనే సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వేణు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గతంలో ఒక దర్శకుడు నుంచి తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలియజేశారు..
ఆలస్యంగా వెళ్ళడం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో దర్శకుడు వివి వినాయక్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు తాను ఆలస్యంగా షూటింగ్ కి వెళ్లినట్లు వేణు గుర్తు చేసుకున్నారు. అయితే ఆరోజు డేట్ క్లాష్ అవ్వటం వల్ల నైట్ వేరే షూటింగ్ ఉండటంతో మరుసటి రోజు ఆలస్యం అవుతుందని నేను కో డైరెక్టర్ కి చెప్పాను. ఆయన ఓకే అనడంతో మరుసటి రోజు కాస్త ఆలస్యంగా షూటింగ్ లొకేషన్లోకి వెళ్లాను.
అందరి ముందు అవమానం?
ఇకపోతే ఆరోజు క్లైమాక్స్ షూటింగ్ మాకు సంబంధించిన సన్నివేశాలు జరుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలియక ఆలస్యంగా వెళ్లాను దీంతో అందరి ముందు డైరెక్టర్ గారు ఎందుకింత ఆలస్యం అంటూ ప్రశ్నించారు. ఇలా నైట్ వేరే షూట్ ఉందని, ఈ విషయం కూడా కో డైరెక్టర్ గారికి చెప్పానని చెప్పినప్పటికీ ఆయన వినకుండా నైట్ షూటింగ్ ఉంటే ఇలా ఆలస్యంగా వస్తారా.. మీకోసం దాదాపు గంట నుంచి అందరం ఎదురు చూస్తున్నాము అంటూ అందరి ముందు సీరియస్ అయ్యారని వేణు ఈ సందర్భంగా అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వేణు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకప్పుడు దర్శకుడు చేత తిట్లు తిన్న ఈయన ఇప్పుడు దర్శకుడిగా మారి ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. బలగం సినిమాతో హిట్ కొట్టిన వేణు త్వరలోనే ఎల్లమ్మ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.
Also Read: నో డౌట్.. ఆయన అరెస్ట్ తెలుసుంటే బిగ్ బాస్ షో నుంచి వాక్ ఔట్ చేసేవాడిని.. శివాజీ వైరల్ కామెంట్స్!