Shivaji: టాలీవుడ్ సినీ నటుడు శివాజీ (Shivaji) ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరీర్ మొదట్లో బుల్లితెర పైన అలాగే వెండితెరపై చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ గుర్తింపు పొందిన శివాజీ అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా హీరోగా కొనసాగుతున్న ఈయన ఉన్నఫలంగా వెండితెరకు దూరమయ్యారు. ఇక చాలా గ్యాప్ తర్వాత శివాజీ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7 ) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈయన విన్నర్ అవుతారని అందరూ భావించారు కానీ టాప్ట్ త్రీ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఆపరేషన్ గరుడ..
బిగ్ బాస్ తర్వాత ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోను అలాగే సినిమాలలోను నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీకి బిగ్ బాస్ గురించి అలాగే రాజకీయాల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. శివాజీ రాజకీయాలపై కూడా పూర్తిస్థాయిలో ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన ఒకానొక సమయంలో ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాల(Politics)పై పెద్ద ఎత్తున సర్వేలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజకీయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
చంద్రబాబు నాయుడు అరెస్ట్..
శివాజీ బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనాలు చోటు చేసుకున్న ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)ముఖ్యమంత్రిగా గెలిచిన సంగతి తెలిసిందే అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంతో అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు విషయాలు గురించి తాజాగా శివాజీ మాట్లాడారు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే నాకు తెలిసిన రెండు విషయాలలో ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని, రెండోది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ (Arrest) అయ్యి జైలుకు వెళ్లి మళ్లీ బయటికి వచ్చారని విన్నాను.
ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి..
ఇలా బాబుగారు అరెస్టు అయ్యారనే విషయం హౌస్ లో ఉన్నప్పుడు నాకు తెలియదు, తెలిసే ఛాన్స్ కూడా ఉండదు. ఒకవేళ ఈ విషయం నేను హౌస్ లో ఉన్నప్పుడే కనుక తెలిసి ఉంటే కచ్చితంగా బిగ్ బాస్ కార్యక్రమానికి మధ్యలో వదిలేసి బయటకు వచ్చేవాడిని అంటూ శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నికలలో గెలిచిన తర్వాత తాను ఇప్పటివరకు కలవలేదని తెలిపారు. ఇక లోకేష్ ను కలిశానని అది కూడా సినీ ఇండస్ట్రీను ఏపీలో అభివృద్ధి చేయడం కోసమే తనని కలిశానని తెలిపారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అంటే ఇప్పటి నుంచి ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే రాబోయే భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ పలు రాజకీయ అంశాల గురించి కూడా శివాజీ ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: బ్యాంక్ స్కాంలో అల్లు అరవింద్.. ఎంట్రీ ఇచ్చిన ED