Akhanda 2 : కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తున్నాయి అంటే అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అటువంటి కాంబినేషన్స్ లో ఒకటి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్. ఇప్పటివరకు వీళ్ల కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. మూడిట్లో కామన్ గా ఉండే పాయింట్ నరకడం.
సింహ సినిమాకి చక్రి సంగీతం అందించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అప్పట్లో లెజెండ్ సినిమా మ్యూజిక్ కూడా మంచి పేరు సాధించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. అప్పుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ దగ్గరుండి నేను ఆర్ఆర్ చేయించుకున్నాను అని స్టేజ్ పైన చెప్పాడు.
వెంటనే దేవిశ్రీప్రసాద్ మైకు లాక్కొని మీరు అలా చెప్పకండి జనాలకు తప్పుగా వెళుతుంది. కొంతమంది పిండుకున్నాను అంటారు నేనేమైనా ఆవునా పిండుకోవడానికి. నా పని ఎవరు గుర్తు చేయాల్సిన పనిలేదు నా పని నేను చేసుకుంటాను జాగ్రత్తగా. నేను ఆర్ఆర్ చేసినప్పుడు నాతోపాటు ఆయన కూడా ఉన్నారు అని స్టేజ్ మీద చెప్పేశాడు దేవి శ్రీ ప్రసాద్.
తర్వాత బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బయట చాలా గట్టిగా వినిపించింది. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలకు తమను సంగీతం అందిస్తున్నారు. అలానే బాలకృష్ణ డైలాగులు ఎంత పవర్ఫుల్ గా చెప్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు మాత్రమే కొన్ని డైలాగులు వర్కౌట్ అవుతాయి. అన్నిసార్లు అవే డైలాగులు వాడితే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది.
ఇక రీసెంట్ గా అఖండ 2 నుంచి రోర్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. అదే యాక్షన్ అదే డైలాగులను అటు తిప్పి ఇటు తిప్పి, అదే లొకేషన్ లో సేమ్ ఫైట్స్. అలానే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొంత కొంత మార్చి రిలీజ్ చేసిన ఫీల్ కొంతమందికి కలిగింది. ఇదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతిసారి అదేనా అని నెటిజన్లు అనడం మొదలుపెట్టారు.
కేవలం ఇది బోయపాటి శ్రీను తప్పు మాత్రమే కాదు. బాలకృష్ణ ఓన్లీ మాస్ మాత్రమే కాకుండా అంతకుమించి ఏదైనా బోయపాటి ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అలానే తమన్ కూడా తన మ్యూజిక్ లో వేరియేషన్ తీసుకురావాలి. బోయపాటి డైరెక్షన్ అండ్ డైలాగ్స్ విషయంలో కూడా కొత్తగా ఏదో చేయాలి. మొత్తానికి వీలు ముగ్గురు మారాలి అనేది చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
Also Read: Bigg Boss 9 : బిగ్ బాస్ స్క్రిప్ట్ లీక్ అయిపోయింది, మినిమం రూల్స్ పాటించడం లేదు