Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు మహేష్. అయితే ఈ మధ్య మహేష్ నటించిన వాణిజ్య ప్రకటనపై ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయిసూర్య డెవలపర్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీనటుడు మహేశ్‌బాబు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది..
మహేష్ బాబు వినియోగదారుల కమిషన్ నోటీసులు..
మహేష్ బాబు చేసిన యాడ్లలో సాయి సూర్య డెవలపర్స్ ఒకటి.. మహేష్ బాబు ఆ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు ని చూసి చాలామంది అక్కడ ఫ్లాట్స్ ని కొనుగోలు చేశారు. కొద్దిరోజుల తర్వాత అక్కడ వెంచర్ బ్రోచర్స్ ఎటువంటివి లేవని, తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. సాయి సూర్య డెవలపర్స్ ప్రకటనల్లో నటించినందుకు మహేశ్ బాబుకు రూ.5.9 కోట్లు పారితోషికం చెల్లించారు. అందులో రూ.2.5 కోట్లు నగదు రూపం లో ఇచ్చారు పంపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవలే మహేష్ బాబుకు నోటీసులు పంపించారు. అప్పుడు షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యం లో విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు లేఖ రాశారు. అయితే నేడు ఆయన విచారణకు హాజరుకానున్నారని సమాచారం. మహేష్ బాబు వల్లే అక్కడ కొనుగోలు చేశామని వినియోగదారులు చెబుతున్నారు. మరి విచారణలో ఎటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారో తెలియాల్సి ఉంది.
Also Read :నిర్మాత చేతిలో మోసపోయిన డైరెక్టర్.. ఏకంగా 14 లక్షలకు టోకర..
మహేష్ బాబు వల్లే మోసపోయాము..
సాయిసూర్య డెవలపర్స్ నిర్వాహకులు లేఔట్ లో అన్ని అనుమతులున్నాయని ప్రచారం చేసుకున్నారని, మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్‌లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాటు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలితో పాటు మరో వ్యక్తి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.. బాలాపూర్ గ్రామంలో చెరొక ప్లాటు కొనుగోలుకు రూ.34.80 లక్షల చెల్లించామన్నారు. అయితే ఆ తర్వాత అసలు లేఔట్ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బు తిరిగివ్వాలని సంస్థ ఎండి పై ఒత్తిడి తీసుకురావడంతో కేవలం 15 లక్షలు మాత్రమే చెల్లించాలని మిగతా డబ్బులు చెల్లించమంటే చేతులెత్తేసారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి యాడ్లను మహేష్ బాబు చేసే ముందర అన్ని కనుక్కొని చేయాలంటూ సదరు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈరోజు విచారణలో మహేష్ బాబు ఏం చెప్తారు చూడాలి. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబును అరెస్ట్ చేస్తారా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.