BigTV English

Renu Desai: రెండో పెళ్లికి సిద్ధమైన రేణూ దేశాయ్.. మళ్లీ మెలిక పెట్టిందే?

Renu Desai: రెండో పెళ్లికి సిద్ధమైన రేణూ దేశాయ్.. మళ్లీ మెలిక పెట్టిందే?

Renu Desai: ప్రముఖ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా రేణూ దేశాయ్ (Renu desai) పేరు సొంతం చేసుకుంది. నిజానికి హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె.. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరింత వార్తల్లో నిలిచింది. ఇక ఈమధ్య భర్తకి దూరంగా.. ముంబైలో పిల్లలతో కలిసి జీవిస్తున్నప్పటికీ ఏదో ఒక విషయంపై రేణు దేశాయ్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జంతు ప్రేమికురాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.


రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ కామెంట్స్..

ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ జీవిస్తోంది. కానీ అటు పవన్ కళ్యాణ్ మాత్రం మూడవ పెళ్లి చేసుకోవడమే కాకుండా పిల్లలకి కూడా జన్మనిచ్చారు. నిజానికి రేణూ దేశాయ్ గతంలోనే మళ్లీ వివాహం చేసుకోవాలని చూసింది. అందుకు తగ్గట్టుగానే ఎంగేజ్మెంట్ కూడా అయిందని వార్తలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే ఆమె తన రెండో పెళ్లిని విరమించుకుందని కూడా సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లిపై ప్రస్తావన తీసుకొస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది రేణూ దేశాయ్.


నా రెండో పెళ్లి అప్పుడే – రేణూ దేశాయ్

ఇకపోతే రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. నేను రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమే. ఇన్ని రోజులు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాను. కానీ ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవడానికి సమయం పడుతుంది. మరో మూడేళ్లలో కచ్చితంగా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అప్పటివరకు వెయిట్ చేయడానికి, ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉంది అంటూ తెలిపింది

ఇన్నాళ్లు అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు – రేణూ దేశాయ్

రెండో పెళ్లి నా పిల్లల కోసమే చేసుకోలేదు. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సమయంలో నా పిల్లలు అకీరా, ఆద్య ఇంకా చిన్నవాళ్ళు. వారికి కేర్ టేకర్ కావాలి. ఆ టైంలో నేను పెళ్లి చేసుకుంటే వారికి తోడు ఇబ్బంది అవుతుంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భర్తతో కూడా నేను గడపాల్సి ఉంటుంది. ఆయన కోసం టైం కేటాయించాలి. అప్పుడు ఇద్దరు పిల్లలు ఒంటరి అయిపోతారు. ఇప్పటికే తండ్రి దూరంగా ఉంటున్నారు. నేను కూడా దూరమైతే వాళ్ళు ఒంటరి ఫీలింగ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇబ్బంది పడతారని ఉద్దేశంతోనే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్లు పెద్ద వాళ్ళు అయిపోయారు. కొన్ని రోజులు ఆగితే కాలేజ్ కి వెళ్తారు. ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరం వారికి రాదు. ఇక పేరెంట్స్ గా వాళ్లకి కేవలం సపోర్ట్ ఇస్తే చాలు.. రోజంతా పేరెంట్స్ అవసరంలేదు. ఇక అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం
రేణు దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Anushka Shetty: నటనకు అనుష్క గుడ్ బై.. కట్ చేస్తే.. నిజం బయటపెట్టిన అనుష్క!

Related News

Shobana: హిజ్రా గా శోభన.. ఇన్నాళ్లకు మనసులోని కోరికను బయటపెట్టేసింది..

Mollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలో వైరల్!

KishkindPuri event :బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆ ముగ్గురు దర్శకులు హాజరు

Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం పిల్లలతో కలిసి కరిష్మ బడా ప్లాన్.. రూ.30 వేల కోట్లంటే మాటలా?

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

×