Mumbai City: వర్షాకాలం వచ్చిందంటే కొన్నిప్రాంతాల అపార్టుమెంట్ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, దీనికితోడు భవనాలను రీమోడల్ చేస్తుండడంతో ఎలాంటి సమస్య వచ్చి పడుతుందేనని భయంతో వణికిపోతున్నారు. తాజాగా ముంబైలోని నాలుగు అంతస్తుల అపార్టుమెంట్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.
తూర్పు ముంబైలోని అల్కాపురి ప్రాంతంలో సాయిరాజ్ అపార్ట్‌మెంట్ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. ఉన్నట్లు భవనం ఒరిగిపోవడాన్ని గమనించారు ఇరుగుపొరుగువారు. వెంటనే అపార్టుమెంటులోని ఉన్నవారికి సమాచారం ఇచ్చారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. భవనం ఒంగిన విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలిపారు.
రంగంలోకి అగ్నిమాపక దళం, VVCMC అధికారులు దిగారు. నివాసితులను వెంటనే అపార్టుమెంట్ నుంచి ఖాళీ చేయించి సమీపంలోని హాలుకు తరలించారు. దాదాపు 70 కుటుంబాలు ఆ అపార్టుమెంటులో ఉన్నట్లు తెలుస్తోంది. రెండువారాల కిందట గ్రౌండ్ ఫ్లోర్ షాపుల కోసం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అపార్టుమెంట్ ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
అయితే VVCMC అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఈ భవన నిర్మాణాన్ని ఇంజనీర్లు తనిఖీ చేసిన తర్వాత ఓ అంచనాకు రానున్నారు. స్థిరంగా ఉంటుందా? ఎప్పుడైనా కూలిపోతుందా? తెలియనుంది. ఇదేకాదు ముంబై సిటీలోని చాలా ప్రాంతాల్లో పాత అపార్టుమెంట్లు ఉన్నాయి. వాటిపై అప్పుడు అనుమానాలు మొదలయ్యాయి.
ALSO READ: సోమవారం అధికారిక సెలవు ఉందా? బ్యాంకులు ఓపెన్ ఉంటాయా?
అన్నట్లు ఆ మధ్య హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఇలాగే జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అందులోని కుటుంబాలను ఖాళీ చేయించారు. ఆ తర్వాత హైడ్రాలిక్ యంత్రాల సాయంతో ఆ భవనాన్ని కూల్చివేసిన విషయం తెల్సిందే. నిర్మాణం సమయంలో సెట్ బ్యాక్ వదలకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. అయితే ఆ భవనం పక్కన సెల్లార్ కోసం తవ్వకాలు జరపడం వల్లే ఒరిగినట్టు నిర్థారణకు వచ్చారు. ఏదేమైనా హైదరాబాద్, ముంబై నగరాల్లో భవనాలు పక్కకు ఒరిగిపోవడంతో కాస్త భయంగా ఉంది.