E-Paper
Advertisement

పోలింగ్ డ్యూటీలో జననాయగన్ సినిమా చూసిన ఆఫీసర్.. అధికారులు ఏం చేశారంటే?

పోలింగ్ డ్యూటీలో జననాయగన్ సినిమా చూసిన ఆఫీసర్.. అధికారులు ఏం చేశారంటే?
Advertisement

Jana nayagan: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో ఉంటూనే మరొకవైపు రాజకీయాలలోకి వెళ్లాలని ఆలోచించిన ఈయన అందులో భాగంగానే టీవీకే అనే పార్టీని స్థాపించి ఈ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తన చివరి సినిమాగా జననాయగన్ సినిమా చేశారు. అయితే సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు సడన్గా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అవడంతో చిత్ర బృందం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోంది. విడుదలకు ముందే ఇలాంటి లీక్ ఎదుర్కోవడంతో లీక్ చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్నికల డ్యూటీలో లీక్ అయిన సినిమాను చూసిన అధికారి

ఇదిలా ఉండగా మరొకవైపు ఈనెల 23వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నా యూనివర్సిటీలో ఎన్నికల నిఘా కోసం యువరాజ్ అనే వ్యక్తిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీసీటీవీ హెడ్ గా నియమించారు. అయితే కీలకమైన నిఘా విభాగంలో ఉన్న అతడు సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్ లో ఉన్న విజయ్ కొత్త సినిమా జననాయగన్ లీక్ అయిన వెర్షన్ ను చూశాడు. ఎన్నికల జరుగుతున్న సమయంలో విధుల్లో ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా సినిమా చూడడం ఒక ఎత్తైతే.. ఆల్రెడీ సోషల్ మీడియాలో లీకైన జననాయగన్ సినిమాను చూసి పైరసీని ఎంకరేజ్ చేయడం మరో ఎత్తు. ఇకపోతే ఆ అధికారి సినిమా చూడడమే కాకుండా సినిమా చూస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఎన్నికల అధికారి అరెస్ట్..

Advertisement

అంతేకాదు అంతకుముందే తాను అన్నా యూనివర్సిటీలో సీసీటీవీ హెడ్గా నియమితుడైనట్లు తన గుర్తింపు కార్డును కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఈ పోస్టులు కాస్త వైరల్ అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చి ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్ళింది. ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా పైరసీని ప్రోత్సహించేలా వ్యవహరించినందుకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ:భర్త ఎఫైర్స్ పై నిజాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!

జననాయగన్ సినిమా విశేషాలు..

Advertisement

ఇకపోతే విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన జననాయగన్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.. మే 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొకవైపు ఈ సినిమా లీక్ నేపథ్యంలో సదరన్ ఇండియా ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ ఎడిటర్ ప్రదీప్ ఈ రాఘవ్ పై కొన్ని రోజుల పాటు సస్పెన్షన్ కూడా విధించింది. ఇక జననాయగన్ సినిమా విషయానికి వస్తే విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా మమితాబైజు కీలక పాత్రలో పోషించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించారు

Related News

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

Big Stories

Advertisement
×