E-Paper
Advertisement

భర్త ఎఫైర్స్ పై నిజాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!

భర్త ఎఫైర్స్ పై నిజాలు బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!
Advertisement

Tollywood: సినిమా అనే రంగుల ప్రపంచంలో సినీ సెలబ్రిటీలు బయటకు ఎంత అందంగా, ఆనందంగా కనిపించినా.. తెర వెనుక వారు పడే కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మనసులో మోయలేనంత బరువు ఉన్నా.. తెర ముందు మాత్రం సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ బరువు ఎక్కువైనప్పుడు మీడియా ముందు తమ బాధను వెళ్ళగక్కుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఇక్కడ ఒక సీనియర్ హీరోయిన్ కూడా ఒకరు. సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా తనకంటూ ఎంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఈమె.. తన జీవితంలో మోయలేని బరువు తనను వెంటాడిందని.. తన భర్త తన కళ్ళ ముందు ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

తన ముందే 9 మంది మహిళలతో ఎఫైర్..

ఆమె ఎవరో కాదు పూజిత. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది. పూజిత మాట్లాడుతూ..” నా భర్త సుమారుగా తొమ్మిది మంది మహిళలతో ఎఫైర్ నడిపాడు. చివరికి ఒక ఐఏఎస్ అధికారిణి కూడా పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్ను పెళ్లాడడం అనేది అప్పట్లో సంచలనంగా మారింది. నా భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి నాకు అన్యాయం చేశాడు” అంటూ పూజిత ఎన్నోసార్లు తన బాధను చెప్పుకొచ్చింది.. ఇకపోతే పూజిత తన భర్త గురించి చెప్పడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సహజీవనం చేశానంటూ సంచలనం..

Advertisement

పూజిత విషయానికి వస్తే.. విజయ్ గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. విజయ్ గోపాల్ తనకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత కూడా రోడ్డుకి ఎక్కింది. అప్పట్లో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

also read:సెన్సార్ పూర్తి చేసుకున్న గాయపడ్డ సింహం.. ఫస్ట్ రివ్యూ.. తరుణ్ గట్టెక్కాడా?

పూజిత కెరియర్..

Advertisement

పూజిత విషయానికి వస్తే.. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్రప్రసాద్ కి రెండవ భార్యగా నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సుమారుగా 140కి పైగా చిత్రాలలో నటించి మెప్పించింది . ఇక తెలుగు విషయానికొస్తే కేవలం తెలుగులోనే 70కి పైగా సినిమాలలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఋతురాగాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న పూజిత ఈ మధ్యకాలంలో అక్కడక్కడ పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే ఏది ఏమైనా వెండితెరపై నవ్వుతూ అందరినీ ఆకట్టుకునే పూజిత వ్యక్తిగత జీవితంలో ఇంత నరకం అనుభవించిందా అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×