Smriti Mandhana wedding : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి ఇటీవలే వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వాయిదా పడటానికి స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని వార్తలు వినిపించాయి. ఇటీవల మళ్లీ పలాష్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లనే స్మృతి మంధాన వివాహాన్ని నిలిపివేసిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా మరో వార్త వచ్చేసింది. వీరి పెళ్లి గురించి వస్తున్న రకరకాల రూమర్స్ గురించి స్మృతి మంధాన సోదరుడు శ్రవన్ మంధాన తాజాగా స్పందించాడు. వాస్తవానికి స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ వాయిదా వేశారు. అయితే డిసెంబర్ 07న కొత్త తేదీని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Also Read : T20 World Cup 2026: వరల్డ్ కప్ కోసం కొత్త జెర్సీ..బీజేపీపై కాంగ్రెస్ సీరియస్ ?
నవంబర్ 23న పెళ్లి వాయిదా పడిన తరువాత స్మృతి తండ్రి అనారోగ్యం ఒక్కటే కారణం కాదనే ఊహగానాలు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి. పలాష్ ముచ్చల్ మరొకరితో సన్నిహితంగా ఉన్నాడనే రూమర్స్ మొదలయ్యాయి. ఈ వదంతులకు బలం చేకూర్చుతూ స్మృతి మంధాన తన ఎంగేజ్ మెంట్, వెడ్డింగ్ ఫంక్షన్లకు సంబందించిన అన్ని ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. పలాష్ కుటుంబం పెళ్లి జరగాల్ఇసన సాంగ్లీ నుంచి ముంబై కి తిరిగి వచ్చింది. మళ్లీ డిసెంబర్ 07న కొత్త తేదీని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
రోజు రోజుకు వదంతులు ఎక్కువవ్వడంతో పలాష్ ముచ్చల్ ఆరోగ్యం పై కూడా ప్రభావం పడింది. స్మృతి తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న పలాష్ తీవ్రంగా ప్రభావితం అయ్యాడని.. ఒత్తిడి, అలసట కారణంగా అతడినీ ముంబైలోని ఆసుపత్రికి మార్చాల్సి వచ్చిందని పలాష్ తల్లి మీడియాకి వెల్లడించారు. ఈ వివాదంలో వెడ్డింగ్ కొరియోగ్రాఫర్లు నందికా ద్వివేది, గుల్నాజ్ ఖాన్ పేర్లు కూడా వచ్చాయి. తాము ఈ వాయిదాకు కారణం కాదని.. తమకు ఏమి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటనలు విడుదల చేశారు. అయితే డిసెంబర్ 07న కొత్త తేదీ నిర్ణయించినట్టు ఓ వార్త వైరల్ అవుతున్న సమయంలోనే మరోవైపు స్మృతి మంధాన సోదరుడు స్పందిస్తూ.. డిసెంబర్ 07 స్మృతి మంధాన-పలాష్ వివాహం జరుగుతుందనే వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 07న పెళ్లికి సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు లేవని వెల్లడించాడు. ఈ వదంతుల గురించి తనకు ఏమి తెలియదు అని.. ప్రస్తుతం పెళ్లి వాయిదాలోనే ఉందని క్లారిటీ ఇవ్వడం విశేషం. మరోవైపు అనుష్కశర్మ ఐదుగురితో ఎఫైర్ పెట్టుకుంటే తప్పులేదు. కానీ ముచ్చల్ ఎఫైర్ పెట్టుకుంటే తప్పా..? విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఇద్దరూ ఎఫైర్స్ పెట్టుకొని మరీ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిలో అడ్డంకులు ఏంటి..? అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Temba Bavuma: 2007 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడేసరికి, నేను స్కూల్ కు వెళుతున్నా