Anirudh About Coolie : రీసెంట్ టైమ్స్ లో బాగా హైప్ వచ్చిన సినిమాలకి ఖచ్చితంగా వినిపించే పేరు అనిరుద్. కేవలం తన మ్యూజిక్ తో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లడం అలవాటు చేసుకున్నాడు. త్రీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి అనిరుద్ మ్యూజిక్ ఫెయిల్ అయిన సందర్భాలు లేవు. కొన్నిసార్లు సినిమాలు ఫెయిల్ అయినా కూడా, ఆయా సినిమాలలో అనిరుద్ మార్క్ కనిపిస్తుంది.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుంది అంటే దానిలో మేజర్ క్రెడిట్ అనిరుద్ కి దక్కాలి. సినిమా ప్రింట్ బయటకొచ్చే చివరి నిమిషం వరకు సినిమా కోసం ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
కూలీ టాక్ చెప్పేసాడు
అనిరుద్ ఈ సినిమా టాక్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పేసాడు. అనిరుద్ పాజిటివ్ గా చెప్పిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం కూలీ సినిమా కూడా అదే మాదిరిగా ఉండబోతుంది అనే క్లారిటీ వచ్చేసింది. కూలీ సినిమా గురించి అనిరుద్ మాట్లాడుతూ… “ఈ సినిమా సూపర్ ఇంటిలిజెంట్ ఫిలిం, ఈ సినిమాకు బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రాసి పవర్ ప్యాక్డ్ గా లోకేష్ కనకరాజ్ దీనిని తయారు చేశాడు. అన్ని క్యారెక్టర్లకి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అని తెలియజేశాడు” అనిరుద్ చెప్పిన ఈ మాటలతో సినిమా మీద నమ్మకం మరింత పెరుగుతుంది అని చెప్పాలి.
భారీ హైప్
ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. లియో సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద నటులు నటించారు. అయితే వాళ్లందర్నీ డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో మాత్రం లోకేష్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇదివరకే విక్రమ్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు.
Also Read: Pawan Kalyan: ఓజీ మూవీ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు