OG Film Warning: పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం చిత్ర దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడం. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైం లో హిట్ టాక్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచిన మనుషుల్లో ఒకడు సుజిత్.
ఆ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చి డైరెక్టర్ గా మారిపోయాడు. డైరెక్టర్ అవ్వడానికంటే ముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేశాడు. రన్ రాజా రన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించుకున్నాడు. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ప్రభాస్ లాంటి దర్శకుడిని హ్యాండిల్ చేసి బాలీవుడ్ లో భీభత్సమైన సక్సెస్ అందుకున్నాడు. దురదృష్టవశాత్తు తెలుగు ప్రేక్షకులకు సాహో సినిమా ఎక్కలేదు.
ఓజి మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్
ప్రస్తుతం ఓ జి సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సినిమా నుంచి మొదటి పాటను ఆగస్టు 2 వ తారీఖున విడుదల చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇన్ డైరెక్ట్ గా డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా సెప్టెంబర్ 25 వరకు కాదు ఆగస్టు 2 నే పోయేటట్టు ఉన్నారు అంటూ ట్వీట్ కూడా వేశారు. ఈ తరుణంలో మరో పోస్టర్ ను విడుదల చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పోస్టర్లో ఏముంది.?
రిలీజ్ చేసిన పోస్టర్లో పక్కన ఇంగ్లీషులో ఒక పెద్ద మ్యాటర్ రాశారు. దాని సారాంశం ఏంటంటే…
“అతని కళ్ళు సమురాయ్ ఉక్కు ప్రశాంతత యొక్క నిశ్శబ్దాన్ని కలిగి ఉన్నాయి, కానీ యుద్ధానికి చెక్కబడ్డాయి. వారు నిన్ను చూడలేదు, వారు నిన్ను తీర్పు తీర్చారు. వారి లోతుల్లో రక్తం మరియు పువ్వులతో తడిసిన చరిత్ర ఉంది. ప్రతి చూపు వెయ్యి మంది పడిపోయిన మగాళ్ళ చివరి శ్వాసను గుసగుసలాడింది. అతను బొంబాయి గందరగోళానికి బుషిడో నియమావళిని తీసుకువచ్చాడు. మాటలు లేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపు మాత్రమే. మాటలు లేవు, కత్తుల కంటే లోతుగా కోసే చూపు మాత్రమే” అంటూ రాశారు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 25న వస్తుందని చిత్ర యూనిట్ పదేపదే కన్ఫామ్ చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ఇవ్వని సంతృప్తి ఈ సినిమా ఇస్తుంది అని చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానుల బలమైన నమ్మకం.
ప్రస్తుతం ఈ ట్వీట్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలా ట్వీట్స్ వేస్తూ సినిమా మీద హైప్ పెంచడం బట్టి మిగతా ప్రొడక్షన్ హౌసెస్ కు కొంతమంది నెటిజన్లు వార్నింగ్ ఇవ్వడం కూడా మొదలుపెడుతున్నారు.
Warning: Ojas Gambheera. #Firestorm #OG #TheyCallHimOG pic.twitter.com/pWHWiGlec0
— DVV Entertainment (@DVVMovies) July 31, 2025