Actor Karthi: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కార్తీ(Karthi) ఒకరు. ఇటీవల కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస హిట్ సినిమాలను అందుకుంటున్న కార్తీక్ త్వరలోనే “సర్దార్2″(Sardar 2)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పి ఎస్ మిత్ర దర్శకత్వంలో, ప్రిన్స్ పిక్చర్స్ పతాకం పై ఎస్ లక్ష్మణన్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గతంలో విడుదలైన సర్దార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తీక్ ద్విపాత్రాభినయంలో కనిపించి సందడి చేశారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న సర్దార్ 2..
ఇలా సర్దార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందానికి మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.
స్వయంగా వడ్డించిన హీరో…
తాజగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిత్ర బృందానికి హీరో కార్తీ స్వయంగా భోజనాలు వడ్డించారని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తూ… అదిదా కార్తీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోలో చిత్ర బృందం అందరూ కూర్చొని భోజనం చేస్తుండగా స్వయంగా కార్తి వారి వద్దకు వెళ్లి బిర్యాని వడ్డిస్తున్నట్లు తెలుస్తోంది.
Unseen 🚨😍
Our man himself served briyani
for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl #Karthi #MrVersatileKarthi pic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025
ఇక కార్తీ హీరో అనే గర్వం లేకుండా ఇలా అందరికీ భోజనం వడ్డిస్తున్న నేపథ్యంలో ఈయన సింప్లిసిటీపై కూడా ప్రశంసల కురిపిస్తున్నారు. ఇక సర్దార్ 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా కార్తీ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎస్ జె సూర్య, మాళవిక మోహన్ ,ఆశికా రంగనాథ్ ,యోగిబాబు వంటి వారు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక కార్తీ నటించిన సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తీ ఈ సినిమా తర్వాత ఖైదీ 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఖైదీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న కార్తీ త్వరలోనే ఖైదీ 2 లో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సంగతి తెలిసిందే.
Also Read: Singer Kanakavva: బిగ్ బాస్ లోకి కనకవ్వ.. గంగవ్వను ఫాలో అవుతోందా..ఛాన్స్ వచ్చేనా?