BigTV English

Punjab News: రాత్రికి రాత్రే మారిన పేదోడి జీవితం.. కలిసొచ్చిన ఆరు రూపాయలు, ఆపై కోటి జాక్‌పాట్

Punjab News: రాత్రికి రాత్రే మారిన పేదోడి జీవితం.. కలిసొచ్చిన ఆరు రూపాయలు, ఆపై కోటి జాక్‌పాట్

Punjab News:  అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో ఏ విధంగా వరిస్తుందో చెప్పలేము.  రోజువారీ కూలీకి అదే జరిగింది. కేవలం ఆరు రూపాయలతో కోటి జాక్ పాట్ కొట్టేశాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నా రా? కేవలం ఆరు రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అతడికి అదృష్టం వరించడంతో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.


పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన కూలీ పేరు జాస్మాయిల్ సింగ్. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో భారం పెరిగింది. ఇటుక బట్టీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ఆదాయం అంతంత మాత్రమే. రోజు రోజుకూ అప్పులు పెరిగాయి. చివరకు 25 లక్షల వరకు అప్పు చేశాడు.

ఈ పరిస్థితి గురించి గట్టెక్కలేక జీవితాన్ని ముగించాలని ఓ ఆలోచనకు వచ్చేశాడు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో జిరాను సందర్శించేటప్పుడు వెళ్లాడు జాస్మాయిల్. పని ముగించుకున్న తర్వాత పాత చక్కెర మిల్లు సమీపంలోని కాళీ మాత ఆలయానికి వెళ్లాడు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని తిరిగి పయనమయ్యాడు. వెళ్తూ దారిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.


జేబులో ఛార్జీలు పోను మిగిలిన పది రూపాయల్లో ఆరు రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. టికెట్ కొనుగోలు చేసిన కొద్ది గంటల్లో కోటి రూపాయల లాటరీ పలికింది. షాపు ఓనర్ చేసి మీ నంబర్ చెక్ చేసుకోండి.. కోటి రూపాయలు గెలుచుకున్నారని చెప్పాడు. కాసేపు నమ్మలేకపోయాడు.. కలా.. నిజమా తనను తాను పరీక్షించుకున్నాడు. చివరకు ఆనందంలో తేలిపోయాడు.

ALSO READ: నిమిష ప్రియ వ్యవహారం.. డబ్బుతో ప్రాణానికి వెల కట్టలేమన్న బాధిత ఫ్యామిలీ

కొనుగోలు చేసిన‌ టికెట్‌ 50E42140 నెంబర్ కు కోటి రూపాయల జాక్‌పాట్ త‌గిలింది. పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు జాస్మాయిల్. ఏ మాత్రం ఆలస్య చేయకుండా జాస్మాయిల్ సింగ్ కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి నుంచి కొద్ది డబ్బులు తీసుకుని తన గ్రామంలో స్వీట్లు పంచిపెట్టాడు. డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

పలికిన లాటరీలో 25 లక్షలు అప్పు చెల్లించడానికి ఉపయోగిస్తానని తెలిపాడు. మిగిలిన డ‌బ్బు పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని మనసులోని మాట బయటపెట్టాడు. పిల్లల విద్య కోసం ఉపయోగిస్తానని తెలిపాడు. జాస్మాయిల్ భార్య వీర్పాల్ కౌర్ అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది. జీవితంలో తాము ఎప్పుడు ఊహించలేమన్నారు.

పిల్లలకు మంచి జీవితానికి అందిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో లాటరీ ద్వారా లక్షాధికారి కావడం ఇది నాలుగోసారి అని షాపు యజమాని తెలిపాడు. మొత్తానికి జాస్మాయిల్ సింగ్ ఇంట్లోకి ఆషాడమాసం వేళ లక్ష్మీ ఆ విధంగా వచ్చిపడింది.

Related News

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Big Stories

×