Coolie Vs War2 : ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్ కు రావడం మానేశారు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడానికి ఉన్న కారణాలలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ ఎక్కువగా కాకపోవటం ఒక కారణం. ఒకప్పుడు సంవత్సరానికి నలుగురు పెద్ద హీరోలు ఉంటే ఎనిమిది సినిమాలు వచ్చేవి. ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ వాళ్లే రెండు సంవత్సరాల ఒక సినిమా చేస్తున్నారు.
అయితే వాళ్ల సినిమా కోసం ఎదురుచూసి ఆడియన్స్ కి ఓపిక కూడా పోయింది. పోనీ చెప్పిన డేట్ కి వస్తారా అంటే ఎన్నో వాయిదాలు కూడా. ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది అంటే మేము సినిమాని చూస్తూ ఎంకరేజ్ చేస్తాము అని తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ప్రూవ్ చేస్తున్నారు. అందుకే ఆగస్టు 14న వస్తున్న రెండు పెద్ద సినిమాలకి కూడా విపరీతమైన బుకింగ్స్ వచ్చాయి. నేటితో బుకింగ్స్ ట్రెండ్ క్లోజ్ అవుద్ది.
అసలు కథ మొదలవుతుంది
బుకింగ్స్ ఇవాళ్టితో అయిపోతుంది. కూలీ సినిమా వార్2 సినిమా నీ డామినేట్ చేయడం చూసాం. అసలు కథ ఇప్పుడు మొదలవుద్ది. కూలీ కి హిట్ టాక్ వచ్చి , వార్2 కి ఫ్లాప్ టాక్ వస్తే, కూలీ కి ఇప్పుడు ఉన్న బుకింగ్స్ డబుల్ అవుతాయి. అలానే వార్2 కి హిట్ టాక్ వచ్చి, కూలీ కి ఫ్లాప్ టాక్ వస్తే, కూలీ కి ఇప్పుడు ఉన్న బుకింగ్స్ మొత్తం వార్2 కి షిఫ్ట్ అవుతాయి.
రేపు మార్నింగ్ పడబోయే ఫస్ట్ షో టాక్ తో ఈ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే,కూలీ కి ఫ్లాప్ టాక్ వచ్చిన, ఇప్పుడు ఉన్న బుకింగ్స్ ఫైర్ మీద ఆల్మోస్ట్ 40-50% రికవరీ నీ రాబట్టుకుంటుంది. కానీ వార్ 2 (war2) కి ఫ్లాప్ టాక్ వస్తె మాత్రం, కానీ విని ఎరుగని డిజాస్టర్ అవుతుంది.
ఎన్టీఆర్ కు కీలకం
టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. వరుస హ్యాట్రిక్ హిట్లు కూడా కొట్టాడు. ఫెయిల్యూర్ డైరెక్టర్ తో కూడా సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, దేవర. ఎన్టీఆర్ తో ఈ సినిమాలు చేసిన దర్శకులు ఆ ముందు సినిమాలు భారీ డిజాస్టర్స్. గత పదేళ్లుగా ఇప్పటివరకు తారక్ ప్లాప్ సినిమా చేయలేదు. ఈ సినిమా హిట్ అవడం కూడా తారక్ చాలా ఇంపార్టెంట్. లేదంటే బాలీవుడ్ ఎంట్రీ తో డిజాస్టర్ మూటగట్టుకున్నాడు అనే పేరు పడిపోవడం ఖాయం. దానికి తోడు దేవరా వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఇంకొంచెం పెరిగి ఉన్నాయి. మరి రిజల్ట్ ఏమవుతుందో రేపు తెలుస్తుంది.
Also Read: Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?