BigTV English

Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?

Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు స్టార్ హీరోల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేర్లలో నాగార్జున పేరు కూడా ఒకటి ఉండేది. నాగార్జున కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


అలానే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక జోనర్ కి మాత్రమే పరిమితం అయిపోకుండా అన్ని జోనర్స్ లో సినిమాలు చేయడంలో నాగార్జున ముందడుగు వేశారు. భక్తి సినిమాలు కూడా నాగార్జున చేశారు. మరోవైపు గ్రేట్ లవ్ స్టోరీస్ చేశారు. అయితే తన లైఫ్ లో ఎప్పుడూ విలన్ పాత్ర మాత్రం నాగార్జున చేయలేదు. మొదటిసారి కూలీ సినిమా కోసం విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఒప్పుకోవటం వెనక చాలా పెద్ద కథ జరిగింది.

అంత ఈజీగా ఒప్పుకోలేదు 


దర్శకుడు లోకేష్ కనకరాజ్ నాగార్జునకి కథ చెప్పడానికంటే ముందు విలన్ పాత్ర గురించి మాట్లాడారు. ఒకవేళ కన్విన్స్ కాకపోతే కాఫీ తాగి పోదాం అని ఫిక్స్ అయ్యారు. అయితే మొదటి కథ చెప్పినప్పుడు నాగార్జునకు అంతగా ఎక్కలేదు. తర్వాత మళ్లీ కథను చెప్పినప్పుడు నాగార్జున రికార్డు చేశారట. రికార్డ్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి కొంచెం డీకోడ్ చేసి తర్వాత ఒప్పుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఏ సినిమా విషయంలో కూడా ఇలా రికార్డ్ చేయడం అనేది నాగర్జున చేయలేదు. మొదటిసారి ఈ సినిమాకు చేశారట. అలానే రాక్షసుడు సినిమాలో నాగార్జున ఎలా అయితే ఉంటారో అదే మాదిరిగా కూలి సినిమాలో కూడా మీరు కావాలి సార్ అని లోకేష్ చెప్పాడట.

ఏకంగా ఏడు నేరేషన్ లు

మామూలుగా కొంతమంది ఒక కథ చెప్పిన వెంటనే నచ్చలేదు అంటే వెనక్కి వెళ్ళిపోతారు. మళ్లీ మళ్లీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయరు. కానీ ఒక పాత్రను రాసుకున్నప్పుడు ఆ పాత్రలో ఈ హీరో అయితేనే సరిపోతాడు అని ఒక క్లారిటీ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి దర్శకులలో లోకేష్ కనకరాజ్ ఒకడు. అందుకే లోకేష్ సినిమాలు ఇప్పటికీ సక్సెస్ అవుతున్నాయి. అయితే నాగార్జునకు ఏకంగా ఏడు సార్లు కథను వివరించి చెప్పాడట లోకేష్. మామూలుగా వినడం స్టార్ట్ చేసిన నాగార్జున లోకేష్ చెబుతూ ఉంటే ఇంకొంచెం ఆసక్తికరంగా విన్నాను అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read: Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Related News

Anupama Parameswaran: ప్లీజ్‌ నా సినిమా చూడండి.. ప్రెస్‌మీట్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ అనుపమ

Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది 

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Big Stories

×