Coolie War 2 films: స్వాతంత్ర దినోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆదివారం ఇలా ఆగస్టు 15 మొదలుకొని ఆగస్టు 17 వరకు మొత్తం మూడు రోజులు సెలవులు కావడంతో.. ఈ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి అటు ఎన్టీఆర్(NTR ), హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్ 2’ చిత్రంతోపాటు ఇటు రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండూ పాన్ ఇండియా చిత్రాలు.. పైగా బడా స్టార్స్ నటిస్తున్న సినిమాలు కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 14వ తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అటు ఏ చిత్రానికి ఆ చిత్రం ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ ప్రేక్షకులలో అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 చిత్రం కంటే రజనీకాంత్ కూలీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు దినం ప్రకటించడమే కాకుండా స్వయంగా టికెట్లు బుక్ చేసి మరీ సినిమాకు పంపిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ చిత్రాలకు రెడ్ అలర్ట్ విధించడం మరింత నష్టాన్ని కలిగించేలా ఉందని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో మూడు రోజులపాటు రెడ్ అలర్ట్ అంటున్నారు. రాబోయే 36 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలా గనుక జరిగితే ఓపెనింగ్స్ రావడం చాలా కష్టం. దీని ఎఫెక్ట్ వార్ 2 పై మరింతగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే కూలీ హవాను వార్ 2 చిత్రం తట్టుకోలేకపోతోంది. ఇలాంటి సమయంలో రెడ్ అలర్ట్ విధిస్తే.. ఈ నష్టం సినిమాపై మరింత పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఇలాంటి సమయంలో వరునుడి ప్రతాపం ఎలా ఉండబోతుందో అని అటు రెండు చిత్ర బృందాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.
వార్ 2 సినిమా విశేషాలు..
హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీ రంగ ప్రవేశం చేస్తున్నది ఈ సినిమాతోనే.. అంతేకాదు ఇందులో విలన్ పాత్ర పోషిస్తూ ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి.
కూలీ 2 సినిమా విశేషాలు..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలీ. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున విలన్ పాత్ర పోషిస్తుండగా.. అమీర్ ఖాన్, సత్యరాజ్ , సౌబిన్ షాహిర్ , ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది.
ALSO READ:Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!