Court Sridevi: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పాపులర్ అయిన చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అద్భుతమైన పాత్రలను పొందుకొంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటున్నారు. అలా యూట్యూబ్లో కెరియర్ మొదలు పెట్టిన చాలామంది నేటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కూడా కొనసాగుతున్నారు.
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు సాధించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి వైష్ణవికి వరుస అవకాశాలు తీసుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన జాక్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక కోర్టు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నటి శ్రీదేవికి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.
కోలీవుడ్ లో అవకాశం
కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను నాని ప్రమోట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. అయితే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా జాబిల్లి పాత్రలో శ్రీదేవి నటించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో ఇప్పటివరకు శ్రీదేవి ప్రాజెక్టు అనౌన్స్ చేయకపోయినా కూడా ప్రస్తుతం కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. మినీ స్టూడియోస్ నిర్మిస్తున్న 15వ చిత్రంలో శ్రీదేవి కనిపించనుంది. ఈ సినిమాలో కేజేఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ నేడు జరిగింది.
కోలీవుడ్ లో సెటిల్ అయిపోతుందా
తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోయిన్స్ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా సెటిల్ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆనంది విషయానికి వస్తే తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాల్లో నటించి తమిళ్లో పెద్ద పెద్ద దర్శకులు తో పని చేసే అవకాశం సాధించుకుంది. తెలుగులో కంటే కూడా తమిళ్లోనే మంచి పేరును సంపాదించుకుంది ఆనంది. అదే మాదిరిగా శ్రీదేవి తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు దగ్గర అయ్యే సినిమాలు చేస్తుందా.? లేకపోతే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతుందా చూడాలి. ఇక కోర్టు సినిమాలో శ్రీదేవితో పాటు నటించిన రోషన్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి బిజీ హీరో అయిపోయాడు.
Also Read : Ratsasan 2 : థ్రిల్లర్ లవర్స్ కు అదిరిపోయే ట్రీట్, వెన్నులో వణుకు పుట్టడం ఖాయం