Jadeja – Washington Sundar : ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎడ్జ్ బాస్టన్ లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు పై విజయఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లాండ్ ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకొని ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది టీమిండియా. నిన్న జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో లంచ్ బ్రేక్ కి ముందు 180 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడూ జడేజా 100 సెకన్లలోనే ఓవర్ కంప్లీట్ చేశాడు. ఇక ఆ తరువాత మరో ఓవర్ వేయడానికి అవకాశం వచ్చింది. ఆ సమయంలో వాష్టింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ పడగొట్టాడు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 336 పరుగుల తేడా ఓడిపోయింది.
Also Read : Virat Kohli: గజదొంగగా మారిన కోహ్లీ… బుద్ధి చెప్పిన ధోని… RCB పరువు మొత్తం పోయిందిగా!
చారిత్రాత్మక విజయం..
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ గా నిలిచాడు. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ కి వెళ్లింది. ఇందులో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. రెండో టెస్టులో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది. ఎడ్జ్ బాస్టన్ ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ వేదిక పై తొలిసారి టెస్టు గెలుపును రుచి చూపించింది. పరుగుల తేడా పరంగా విదేశీ గడ్డ పై టీమిండియా కి ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపులో కెప్టెన్ శుబ్ మన్ గిల్ తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ లది అత్యంత కీలక పాత్ర. డబుల్ సెంచరీ 269, సెంచరీ 161తో చెలరేగి.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచింది గిల్ సేన.
ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శన..
వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఇక ఇంగ్లాండ్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి.. టీమిండియా విజయాన్ని ఖరారు చేసాడు. తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చిన ఆకాశ్.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. వీరిలో ముఖ్యంగా బెన్ డకెట్, ఓలి పోప్ లను డకౌట్ చేశాడు. హ్యారీ బ్రూక్ 158, క్రిస్ వోక్స్ 5 వికెట్లను తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ బెడ్ డకెట్, పోప్ ల పని పట్టాడు. జో రూట్, హ్యారి బ్రూక్, జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్, వికెట్లను పడగొట్టిన రైట్ ఆర్మ్ పేసర్ అదుర్స్ అనిపించాడు. 21.1 ఓవర్లలో 99 పరుగులు ఇచ్చి.. 6 వికెట్లను కూల్చాడు. మొత్తానికి రెండో టెస్టులో 187 పరుగులు ఇచ్చి.. పది వికెట్లు పడగొట్టిన ఆకాశ్ దీప్.. టీమిండియా తరపున ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసాడు ఆకాశ్ దీప్. రవీంద్ర జడేజా 15 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ 6 ఓవర్లు వేసి 28 పరుగులు సమర్పించుకొని 1 కీలక వికెట్ తీశాడు. అలాగే సిరాజ్, ప్రసిద్ కూడా తలో వికెట్ తీశారు.