BigTV English

HBD Dhoni: ధోని క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 12 కటౌట్స్.. ఒక్కొక్కటి 50 అడుగులకు పైగానే

HBD Dhoni: ధోని క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 12 కటౌట్స్.. ఒక్కొక్కటి 50 అడుగులకు పైగానే

HBD Dhoni: ప్రతి సంవత్సరం భారతదేశంలోని చాలామంది క్రికెట్ అభిమానులకు జులై 7 చాలా ముఖ్యమైన తేదీ. ఎందుకంటే భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇదే రోజున జన్మించాడు. ఈ నేపథ్యంలో నేటితో మహేంద్ర సింగ్ ధోని 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. తన 16 ఏళ్ల జర్నీలో ఈ మిస్టర్ కూల్.. భారత్ కి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు.


Also Read: Virat Kohli: గజదొంగగా మారిన కోహ్లీ… బుద్ధి చెప్పిన ధోని… RCB పరువు మొత్తం పోయిందిగా!

తన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ధోని. తన సహచర ఆటగాళ్లు, సన్నిహితులు, అభిమానుల ఆశీస్సుల మధ్య ధోని తన పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించుకున్నాడు. ఈ వేడుకల్లో భాగంగా ధోని తన ఏడుగురు ఆప్త మిత్రులతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అభిమానులు తమ ప్రియమైన “తలా” కు శుభాకాంక్షలు చెబుతున్నారు.


మరోవైపు ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అతడు భారత క్రికెట్ కి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ధోనికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడలో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని భారీ స్థాయిలో చాటుకున్నారు. ధోని భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి.. చెన్నై సూపర్ కింగ్స్ జండాలు పట్టుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

ఒక్క విజయవాడలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 12 కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్లు 20, 30 అడుగులు కాదు.. ఒక్కో కటౌట్ ఏకంగా 50 అడుగుల ఎత్తు ఉంది. ఈ కటౌట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. క్రికెట్ లో ఎన్నో విన్నింగ్ షాట్స్ కొట్టి నిశ్శబ్దంగా ఉండిపోతాడు ధోని. వాస్తవానికి అతడి స్థానంలో మరో ఆటగాడు గనుక ఉండి ఉంటే ఇంకో విధంగా ఉండేది. కానీ అక్కడ ఉండి ధోనీ కాబట్టి కూల్ గా ఉండిపోతాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ధోనీ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి.

ఎంత ఎదిగి ఉన్నా సరే.. ఒదిగి ఉండాలని అనుకుంటాడు. అందువల్లే ధోని అంటే యావత్ దేశం మొత్తం అభిమానిస్తుంది. అతడు ఆడుతుంటే ఊగిపోతుంది. అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే కేరింతలు, కేకలతో హోరెత్తిస్తారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ధోని క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుండి చెన్నై జట్టుతో ధోని కి ఉన్న విడదీయరాని బంధానికి, దక్షిణాదిలో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో కూడా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో ధోని ఆడతాడా..? లేదా..? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Also Read: Shubman Gill- Sara: ఇంగ్లాండ్ కు వెళ్లిన సారా… గిల్ కు ప్రేమ పాఠాలు చెబుతూ… వీడియో చేస్తే

దీనిపై స్పందించిన ధోని తన నిర్ణయం చెప్పడానికి మరో ఆరు నెలల సమయం పడుతుంది అని తెలిపాడు. ధోని కెప్టెన్సీ లో 2007 టీ-20 ప్రపంచ కప్ గెలిచిన భారత్.. మొదటి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తరువాత భారత్ కు వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ ని అందించాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో ధోని కెప్టెన్సీలో 60 మ్యాచ్ లు జరగగా.. అందులో 27 గెలుపొందిన భారత్.. మరో 18 మ్యాచ్ లు ఓడిపోయింది. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఐదుసార్లు టైటిల్ అందించాడు.

Related News

Kohli-Rohith : పాపం…భారత-A జట్టులో కోహ్లీ, రోహిత్… ఆ యంగ్ ప్లేయర్ కెప్టెన్సీలో ?

Rishabh Pant : బ్రాంకో టెస్ట్ కోసం పంత్ అదిరిపోయే స్కెచ్… కొత్త తరహా ట్రీట్మెంట్ తీసుకుంటూ కసరత్తు

Hardik Ex wife Natasha : డంబుల్స్ పై పాండ్యా భార్య అరాచకం.. సింగిల్ లెగ్ పైన నిలబడి మరీ

Canada vs Scotland: క్రికెట్ అరుదైన సంఘ‌ట‌న‌…తొలి రెండు బంతుల‌కే ఓపెన‌ర్లు ఔట్..148 ఏళ్ల త‌ర్వాత‌

Sabalenka : యుఎస్‌ ఓపెన్‌ 2025 టైటిల్ విజేతగా అరీనా సబలెంక..ప్రైజ్ మనీ ఎంతంటే

BCCI : బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా.. ప్ర‌పంచంలోనే రిచ్..!

Big Stories

×