Mrunal Thakur:’సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. తన అందం, అభినయంతో, నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఈ సినిమా తర్వాత నాని (Nani) హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేసిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందించలేదు. ఇక తెలుగులో అవకాశాలు తలుపు తట్టకపోవడంతో ఈమె తెలుగు కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా శృతిహాసన్ కారణంగా ఈమెకు ఒక మంచి అవకాశం లభించింది అని చెప్పవచ్చు.
మృణాల్ ఠాగూర్ కి చిత్ర బృందం స్వీట్ సర్ప్రైజ్..
అసలు విషయంలోకి వెళ్తే.. అడివి శేషు (Adivi shesh) హీరోగా నటిస్తున్న డెకాయిట్ (Decoit ) సినిమా నుండి శృతిహాసన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అవకాశం అందుకుంది మృణాల్ ఠాగూర్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా చిత్ర బృందం తాజాగా ఈమెకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చి మృణాల్ ను సంతోషపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆగస్ట్ 1 న మృణాల్ బర్తడే కావడంతో ఒకరోజు ముందుగానే అంటే జూలై 30 వ తేదీన ఈమె ప్రీ బర్తడే సెలబ్రేషన్స్ చేసి ఆమెను సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అక్కడే ఈమెకు ప్రీ బర్తడే వేడుకలను నిర్వహించింది చిత్ర బృందం. ఇక కేక్ కట్ చేసిన తర్వాత మృణాల్ టీం తో కలిసి డాన్స్ కూడా చేసింది.
డెకాయిట్ సినిమాలో ఆమె పాత్ర పేరు ఇదే..
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మృణాల్ కట్ చేస్తున్న సమయంలో “హ్యాపీ బర్తడే సరస్వతి” అంటూ అందరూ విష్ చేశారు. ఇక ఈ సినిమాలో ఈమె పాత్ర పేరు సరస్వతి అని తెలుస్తోంది. మొత్తానికైతే ఆమెకు ప్రీ బర్తడే సెలబ్రేషన్స్ చేస్తూనే.. మరొకవైపు సినిమాలో ఆమె పాత్ర పేరు సరస్వతి అని చెప్పకనే చెప్పేసింది చిత్ర బృందం.. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది కూడా సినిమా ప్రమోషన్ అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
డెకాయిట్ సినిమా విశేషాలు..
డెకాయిట్ సినిమా విశేషాలకి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ షానీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు, హిందీ భాషలలో డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా.. ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి , జైన్ మరియా ఖాన్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. “డెకాయిట్ : ఒక ప్రేమ కథ” పేరుతో రానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా ద్వారానే ప్రముఖ నటుడు అనురాగ్ కశ్యప్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ ఉండడం విశేషం.
ALSO READ:Vidhyabalan: ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు.. ఊహించని కామెంట్స్ చేసిన విద్యాబాలన్!
A pre-birthday bash for the charming @mrunal0801 planned by team #Dacoit on the sets 🥳🎂
A super surprise for the birthday girl ✨#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas #BheemsCeciroleo… pic.twitter.com/dIP3k3yMlw
— Annapurna Studios (@AnnapurnaStdios) July 30, 2025