BigTV English

Visakhapatnam: ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్.. ఏషియాలో అతి పెద్దది, అమెరికా తర్వాత ఇదే

Visakhapatnam: ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్.. ఏషియాలో అతి పెద్దది, అమెరికా తర్వాత ఇదే

Visakhapatnam:  రాబోయే నాలుగేళ్లు ఏపీ రూపు రేఖలు మారుతాయా? ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? ఈ విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


విశాఖలో గూగుల్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుందని గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి గతంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీనిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ ముందుకొచ్చింది. దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి అన్నమాట. ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ స్వయంగా వెల్లడించింది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 50 వేల కోట్ల రూపాయలు.


అందులో 2 బిలియన్ డాలర్లు కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ సెంటర్‌కి కేటాయించనుంది. డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ అందించనుంది. విశాఖలో నిర్మించబోయే డేటా సెంటర్ ఏషియాలో అతిపెద్దది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌గా దీన్ని వర్ణిస్తున్నారు.

ALSO READ: ఏపీలో ఉచిత బస్సు స్కీమ్.. ఖచ్చితంగా ఆ కార్డు ఉండాల్సిందే

సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌ దేశాల్లో డేటా సెంటర్ విస్తరణలో భాగంగా విశాఖ సెంటర్ ఉంటుందని రాయిటర్స్ చెబుతున్నమాట. ఆంధ్రప్రదేశ్‌ని టెక్ హబ్‌గా మార్చేందుకు విశాఖలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు మంత్రి లోకేష్. ముంబైలో ఉన్న దానికంటే రెండు రెట్లు ఎక్కువట.

కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు డేటా సెంటర్‌లకు దగ్గరగా ఉంటాయి. సముద్ర గర్భ కేబుల్‌ల నుండి డేటాను స్వీకరించి వాటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. డేటా సెంటర్లు, వాటి అవసరాలను తీర్చడానికి ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించాలని చూస్తోందన్నారు మంత్రి.

విద్యుత్-ఇంటెన్సివ్ పరిశ్రమ నుండి రాబోయే ఐదేళ్లలో 10 GW వరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య అవసరాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు.  గూగుల్ ఈ స్థాయిలో డేటా సెంటర్ ఏర్పాటుకు కారణాలు చాలానే ఉన్నాయి. దేశంలో డిజిటల్ సేవలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ అటువైపు దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.

విశాఖను ఎంచుకోవడం వెనుక ఆ ప్రాంతానికున్న ప్రత్యేకతలు, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ఓ కారణంగా చెబుతున్నారు. విశాఖలో మధురవాడ ప్రాంతం డేటా సిటీకి కేరాఫ్‌గా చెబుతున్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో టెక్నాలజీ క్లస్టర్ ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ ఐటీ-AI హబ్‌గా మార్చే ప్రణాళికలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

గూగుల్ ఇప్పటికే ఆ ప్రాంతంలో 80 ఎకరాలను కొనుగోలు చేసింది. ఈ డేటా సెంటర్ దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా వర్ణిస్తున్నారు. ఏఐ క్యాంపస్ ఆనందపురం-భీమిలి మధ్య రానున్నట్లు తెలుస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆ ప్రాంతం చాలా దగ్గర కూడా. ఈ నేపథ్యంలో విశాఖ ప్రాంతాన్ని గూగుల్ ఎంపిక చేసినట్టు ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. రాయిటర్స్ కథనాన్ని టీడీపీ తన ఎక్స్ ద్వారా షేర్ చేసింది.

 

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×