BigTV English
Advertisement

Deepika Padukone: దీపిక పదుకొనేకి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే!

Deepika Padukone: దీపిక పదుకొనేకి అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే!

Deepika Padukone: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone)కి మరో అరుదైన గౌరవం లభించింది. గత కొన్ని రోజుల క్రితమే అరుదైన ఘనతను సాధించిన విషయం తెలిసిందే. “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026” కి దీపిక ఎంపికైంది. అంతేకాదు ఆ గౌరవం దక్కిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది.. ఇక అంతలోనే ఇప్పుడు మరో గౌరవాన్ని దక్కించుకోవడంతో దీపికా పదుకొనే పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


అరుదైన గౌరవం అందుకున్న దీపికా పదుకొనే..

ప్రముఖ మ్యాగజైన్ “ది షిఫ్ట్” ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో దీపికా పదుకొనే స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా సృజనాత్మకత, క్రియాశీలత , నాయకత్వం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో దీపికా పదుకొనే పేరుతోపాటు జోయా అక్తర్, ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఏంజలీనా జోలీ, సెలీనా గోమేజ్ తదితరులు స్థానం సంపాదించుకున్నారు.


100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షిషియల్ పీపుల్ జాబితాలో కూడా..

దీనికి తోడు దీపికా పదుకొనే.. 2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన వ్యక్తులుగా ” 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షిషియల్ పీపుల్” జాబితాలో కూడా ఈమె చోటు దక్కించుకున్నారు. అంతేకాదు 2022లో ఫుట్బాల్ ప్రపంచ కప్ ను ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆకర్షించారు దీపిక పదుకొనే.

దీపికా పదుకొనే ప్రస్తుత సినిమాలు..

ఇకపోతే సందీప్ రెడ్డివంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్ (Prabhas ) కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనేకి హీరోయిన్గా అవకాశం లభించింది. కానీ అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతోనే ఆమెను తప్పించి, ఆమె స్థానంలో తృప్తి డిమ్రి(Tripti dimri) ని రంగంలోకి దింపారు. ఇక ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న AA 26 సినిమాలో అవకాశాన్ని అందుకుంది దీపికా పదుకొనే. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా.

దీపికా పదుకొనే కెరియర్..

దీపికా పదుకొనే విషయానికి వస్తే.. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్ట్, లిమ్కా వంటి ప్రకటనలలో నటించిన ఈమె.. మేబెలిన్ అనే కాస్మెటిక్ కంపెనీ ఈమెను అంతర్జాతీయ అధికార ప్రతినిధిగా కూడా నియమించుకుంది. అంతేకాదు ఐదవ వార్షిక కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.2006లో ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్య తో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. 2007లో షారుక్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఓం శాంతి ఓం సినిమాలో నటించి పలు అవార్డులు కూడా దక్కించుకుంది . ఇక ఇప్పటికీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది దీపికా పదుకొనే.

ALSO READ: Kingdom: విజయ్ కోసం రంగంలోకి యంగ్ విలన్.. అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Related News

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Big Stories

×