Kingdom: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరి (Gautam thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా మరో మలయాళ నటుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆ నటుడు హైలైట్ అవ్వడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడు ఎవరు? అతడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఇలా పలు విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
విజయ్ కోసం రంగంలోకి కొత్త విలన్..
అసలు విషయంలోకి వెళ్తే.. అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ లో శ్రీలంకలో జరిగే స్టోరీ తో ఈ కింగ్డమ్ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్ లోనే కథ ఏంటి అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా, సత్యదేవ్(Sathyadev ) కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా కనిపించిన ఒక నటుడు.. ఇప్పుడు సినిమాకే హైలెట్గా నిలవనున్నారు. ఇక అతడి పేరు వీపీ వెంకటేష్ (VP Venkatesh). ట్రైలర్లో కేవలం రెండు షాట్స్ లోనే కనిపించినా.. అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈయన ఎవరు?ఎక్కడి నుంచి వచ్చారు ? అసలు.ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్స్.
అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈయన మలయాళ ఇండస్ట్రీకి చెందినవారు. 2014 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం లో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తున్న ఈయన ‘ఒడియన్’, ‘తట్టుంపురత్ అచ్యుతన్’, ‘వెలిపాడింటే పుస్తకం’ వంటి తదితర చిత్రాలలో కనిపించారు. అంతేకాదు తమిళంలో జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) హీరోగా నటించిన ‘రెబల్’ అనే సినిమాలో విలన్ గా కూడా చేశారు. అక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకొని తెలుగు దర్శకులను ఆకర్షించడంతోని గౌతమ్ ఈయనకు కింగ్డమ్ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మరో కొత్త విలన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దొరికాడేమో అనిపిస్తుంది. అంటూ మూవీ లవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే..
విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉండగా.. భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు.అయితే పార్ట్ 1 ఫలితాన్ని బట్టి పార్ట్ 2 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఎప్పుడో జూలై 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అటు ఆగస్టు ఒకటిన విడుదల చేయాల్సి ఉండగా అష్టమి కావడంతో ఒకరోజు ముందుగానే అంటే జూలై 31వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సెంటిమెంట్ చూసి మరీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.