Barabanki Stampede: దేవాలయాల్లో ఏం జరుగుతోంది? ఎందుకు చీటికి మాటికీ తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి? అక్కడి సిబ్బంది నిర్లక్ష్యమా? అరాచక శక్తుల ప్రమేయం ఉందా? రెండు రోజుల కిందట హరిద్వార్ ఘటన జరగ్గా, ఇప్పుడు యూపీలోని బారాబంకీ దేవాలయం వంతైంది. అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా అవసానేశ్వర్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
శ్రావణ సోమవార వ్రతంలో ఆది దంపతులు శివ పార్వతులను భక్తులు పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసంలో సోమవారపు వ్రతాన్ని పాటిస్తే శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. బారాబంకి జిల్లాలో అవసానేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
భక్తులు పూజలు చేస్తున్న అక్కడికి వందల కోతులు అక్కడికి చేరుకున్నాయి. కోతులు జంప్ చేసుకుంటూ విద్యుత్ తీగలపై దూకడంతో ఒక్కసారిగా కరెంటు వైర్లు తెగి భక్తులపై పడ్డాయి. అదే సమయంలో అక్కడున్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగిందని అంటున్నారు పోలీసులు.
ALSO READ: చోళ సామ్రాజ్యంలో ఏం జరిగిందంటే.. మోదీ ఆసక్తికర ప్రసంగం
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 40 మంది వరకు గాయపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగ్రాతులను అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రెండు రోజుల కిందట ఉత్తరాఖండ్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. 30 మంది భక్తులు గాయపడ్డారు. విద్యుత్ షాక్ పుకార్లతో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ ఘటన జరిగిందని చివరకు తేల్చారు.
తాజాగా యూపీలోనూ విద్యుత్ వైర్లు తొక్కిసలాటకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అధికారులు. ఈ ఘటన వల్ల తెర వెనుక ఎవరైనా శక్తులు ఉన్నారా? అన్న సందేహాలు లేకపోలేదు. మరి అధికారుల విచారణలో ఏయే అంశాలు బయటకు వస్తాయో చూడాలి.
#BREAKING
Stampede at Barabanki's Avsaneshwar Temple before darshan today… 15 devotees injured📌The injured have been admitted to the hospitalpic.twitter.com/iJaQlnXUr4 #Barabanki #TempleStampede #India https://t.co/rVWlA2a7ab
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) July 28, 2025