BigTV English
Advertisement

Deepika Padukone: దీపికకు హాలీవుడ్ లో అరుదైన గౌరవం.. ఆ అవార్డు కి ఎంపిక!

Deepika Padukone: దీపికకు హాలీవుడ్ లో అరుదైన గౌరవం.. ఆ అవార్డు కి ఎంపిక!

Deepika Padukone: దీపికా పదుకొనే(Deepika Padukone).. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది దీపికా పదుకొనే. ఒకప్పుడు వరుస సినిమాలతో, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడైతే ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ (Prabhas ) ‘స్పిరిట్’ సినిమాకి సైన్ చేసి.. అనూహ్యంగా సినిమా నుండి తప్పుకుందో.. అప్పటినుంచి భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, దీనికి తోడు సెట్లో 8 గంటల పని సమయం కోరింది అని, ఇలా పలు కారణాలవల్ల సందీప్ ఈమెను సినిమా నుంచి తప్పించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన దీపికా పదుకొనే పీఆర్ టీమ్ స్పిరిట్ సినిమా స్టోరీ రిలీజ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ డర్టీ పీఆర్ టీమ్ అంటూ పెద్ద ఎత్తున మండిపడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత దీపికాకి కొంతమంది సపోర్ట్ చేయడం అన్నీ కూడా జరిగిపోయాయి.


హాలీవుడ్లో దీపికాకు అరుదైన గౌరవం..

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు హాలీవుడ్ లో అరుదైన గౌరవం లభించింది అని తెలిసి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీపికా అభిమానులైతే ఇది మా హీరోయిన్ రేంజ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. వాస్తవానికి దీపికా గురించి, ఈమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఆస్కార్ వేడుకలలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ తరఫున చాలా చక్కగా మాట్లాడి, ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హాలీవుడ్లో ఈమెకు ఊహించని గౌరవం లభించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపికాను “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్” అవార్డుకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈమెను ఎంపిక చేసింది. మోషన్ పిక్చర్స్ కేటగిరీలో వచ్చే ఏడాది ఈ పురస్కారం అందించనుంది. ఇకపోతే ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ గా కూడా దీపిక రికార్డు లోకి ఎక్కారు.


దీపికా పదుకొనే సినిమా జీవితం..

2006లో ఉపేంద్ర (Upendra) హీరోగా వచ్చిన కన్నడ సినిమా ‘ఐశ్వర్య’ సినిమాతో తో తొలిసారి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత 2007లో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించిన ఈ చిత్రానికి ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఈమెకు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది. ఇక తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనతో, విలక్షణమైన వ్యక్తిత్వంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

దీపికా పదుకొనే అందుకున్న అవార్డులు..

‘ఓం శాంతి ఓం’ చిత్రానికి గానూ 2008లో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అదే సినిమా కోసం అదే ఏడాది సోనీ హెడ్ అండ్ షోల్డర్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటి అవార్డు కూడా అందుకోవడం గమనార్హం. ఇక మళ్లీ ఓం శాంతి ఓం సినిమా కోసం స్టార్ స్క్రీన్ అవార్డు జోడి నెంబర్ వన్ క్యాటగిరిలో షారుక్ ఖాన్ తో పాటు ఈమెకు కూడా అవార్డు లభించింది. ఇక స్టార్ స్క్రీన్ అవార్డు ఫర్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమ్మర్ ఫిమేల్ గా కూడా అవార్డు లభించింది. అంతేకాదండోయ్ జీ సినీ అవార్డు, జీ సినిమా ఉత్తమ నటి అవార్డు, అప్సర అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ఇవన్నీ కూడా ఒకే సినిమాకు సొంతం చేసుకోవడం గమనార్హం..

Related News

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Big Stories

×