Illu Illalu Pillalu Today Episode july 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ అర్ధరాత్రి కు వచ్చి ఓపిక లేక పడుకుంటాడు. ధీరజ్ అలా పడుకోవడం చూసి ప్రేమ బాధపడుతుంది. ఈ దెబ్బ తగలడంతో ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కాలికి మందు వేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కు తన వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడుతుంది. ధీరజ్ కి ఏదైనా సాయంగా చేయాలని ప్రేమ నిర్ణయించుకుంటుంది. అటు నర్మదా సాగర్ కోసం తెచ్చిన బుక్స్ ని ఇచ్చి చదువుకోమని చెప్తుంది. సాగర్ మాత్రం గట్టిగా అరుస్తూ చదువుతాడు. రాత్రి ఇలా చదివితే ఏ దయ్యాల వచ్చి చదువుతున్నాయని ముందుగా మీ నాన్న ఇక్కడికి వస్తాడు అని నర్మద అంటుంది. ఇద్దరు ఇంట్లో వాళ్లకు కనిపించకుండా బయట దుకాణం పెట్టేస్తారు. శ్రీవల్లి వాళ్లను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ ఉదయం లేవగానే ధీరజ్ నీకు గుడికి తీసుకుని వెళుతుంది. ఇంత ఉదయాన్నే నీకు ఇంత మంచి అలవాట్లు ఏంటి అని ప్రేమపై సెటైర్లు వేస్తాడు ధీరజ్. మనసేం బాగోలేదు పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకే గుడికి తీసుకుని వచ్చాను అని అంటుంది. నాకు డెలివరీ కి టైం అవుతుంది వెళ్దామా అని ధీరజ్ అంటాడు.. కాసేపు కూర్చుని వెళ్దామని అక్కడ కథ చెప్పే వ్యక్తిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కథను విని ధీరజ్ కోసం ఏదైనా చేయాలి నాకోసం చాలా కష్టపడుతున్నాడని ఒక నిర్ణయం తీసుకుంటుంది. కచ్చితంగా ధీరజ్ కి మనీ సపోర్ట్ నేను ఇవ్వాలి అని అనుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా కూడా నేను వాడికి సపోర్ట్ గా ఉండాలి అని ఫిక్స్ అవుతుంది. ఎప్పటిలాగే రెండు వేళ్ళు చూపించి పట్టుకోమని అడుగుతుంది.. ధీరజ్ మాత్రం టెన్షన్ పడుతూ పెద్ద గొడవ సృష్టించవద్దు అని అంటాడు. అదేం లేదులేరా పద వెళ్లిపోదామని ప్రేమ అంటుంది.
ఏమో నువ్వు పోయినసారి ట్యూషన్ అన్నావ్ ఆ తర్వాత డాన్స్ క్లాస్ అన్నావ్.. ఇలా పెద్ద గొడవలు తెచ్చి పెట్టావు. ఈసారి ఏ గొడవలు తెచ్చి పెడతావని నాకు టెన్షన్ గా ఉంది అని అంటాడు.. ఉదయం లేవగానే చందు సీరియస్గా శ్రీవల్లి దగ్గరికి వచ్చి నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్దాం పద అని చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. శ్రీవల్లి మాత్రం ఎక్కడికి బావ ఆగు బావా అని అరుస్తుంది. కానీ చందు మీ ఇంటికి వెళ్ళాలి అని సీరియస్ అవుతాడు. అయితే శ్రీవల్లి మా ఇంట్లో వాళ్ళు లేరు బావ అని అరుస్తుంది. త్వరగా ఆ పది లక్షలు ఇవ్వకపోతే ఆ సేటు మా ఇంట్లో చెప్పేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు. ప్రతిరోజు ఆఫీస్ కి వస్తున్నాడు. నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చందు బాధపడతాడు..
నువ్వు ఆ పది లక్షలు గనక ఇంకొక రోజులో తీసుకురాకపోతే నేను అసలు ఇంటికి రాను అని చందు వల్లికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.. అయితే ఆ మేటర్ ని నర్మదా వింటుంది. శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ ఇలా ఇరికిస్తుందని అసలు అనుకోలేదు ఆయన టెన్షన్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటుంది.. అక్క
నర్మద వచ్చి ఆ 10 లక్షలు మేటర్ ఏంటక్కా ఎందుకు బావగారు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. ఇది మా పర్సనల్ విషయాలు మా పర్సనల్ విషయాలు చేసుకుంటే మర్యాదగా ఉండదు. చందు బావ గారు అంత టెన్షన్ పడుతూ వెళ్లాడు.. ఇంటికి సంబంధించిన వరకు బావగారు టెన్షన్ పడుతూ ఉంటే మేమెలా గమ్మున ఉంటామని అంటుంది. ఇది మా పర్సనల్ విషయం నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు ఈ కథ చాలా దూరం వెళుతుంది అని నర్మదతో శ్రీవల్లి అంటుంది.
ఇది ఇంటికి సంబంధించిన విషయం అసలు పది లక్షలు మేటర్ ఏంటో తెలుసుకునే అంతవరకు నేను వదలనని నర్మదా శ్రీవల్లితో ఛాలెంజ్ చేస్తుంది. కచ్చితంగా ఈ విషయాన్ని నేను మావయ్య గారితో చెప్పి అసలు విషయం ఏంటో తెలుసుకుంటానని నర్మదా అంటుంది. కథ చాలా దూరం వెళుతుంది అది గుర్తుపెట్టుకో అనేసి శ్రీవల్లి అంటుంది. ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా పోట్లాడుకుంటారు.. ఎవరికి దొరకకూడదు వాళ్లకి దొరికేసాను ఈ నర్మదా నన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read :‘ తమ్ముడు ‘ మూవీ ఫస్ట్ రివ్యూ.. నితిన్ హిట్ కొడతాడా..?
అటు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్తుంది. నేను ఇప్పుడు ఎవరికీ భయపడను డాన్స్ క్లాసులు ఆపను అని వాళ్ళకి హామీ ఇస్తుంది. ప్రేమ దిగ్విజయంగా డాన్స్ క్లాస్ లను మొదలు పెడుతుంది. అయితే నర్మదా ఫోన్ చేసి ప్రేమను ఎక్కడున్నావని అడుగుతుంది. అర్జెంటుగా కలవాలి రా వెళ్దామని ప్రేమతో అంటుంది. సరే అక్క లొకేషన్ షేర్ చేయండి నేను వెంటనే వస్తాను అని ప్రేమ అంటుంది. ఇద్దరూ కలిసి ఆ వల్లి మ్యాటర్ గురించి మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతాడు ఆ సెంటర్ కి మనం వెళ్దాం పద అని నర్మదా ప్రేమను తీసుకొని వెళుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒకచోట ఆనందరావు ఇడ్లీలు అమ్మడం చూసి అక్కడికి వెళ్తారు. బాబాయ్ నాకు ఒక రెండు ఇడ్లీలు అని నర్మదా అడుగుతుంది. ఆనందరావు షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి బండారం నర్మదా బయట పెడుతుంది.. రామరాజు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..