BigTV English

Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్

Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్

Kalki 2 : ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగ అశ్విన్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని మహానటి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.


ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు అని ఒక అపోహ ఉన్న తరుణంలో మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా వస్తారు అని నిరూపించిన సినిమా మహానటి. సావిత్రమ్మ కథను కళ్ళకు కట్టినట్లుగా, కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా చేశాడు దర్శకుడు.

దీపిక తప్పుకోవడానికి కారణం

ఈ సంవత్సరం నటి దీపికా పదుకొనే రెండు ప్రధాన ప్రాజెక్టుల నుండి తప్పుకుంది – సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మరియు నాగ్ అశ్విన్  కల్కి 2898 AD కి సీక్వెల్. ఆమె తప్పుకోవడానికి కారణాలు చాలా వినిపించాయి. 2022 లో, ఆమె కల్కి 2898 AD సహనటి శాశ్వత ఛటర్జీ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నిబద్ధతను ప్రశంసించారు.


షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు దీపిక సెట్‌కి వచ్చిందని, కానీ సాయంత్రం 5.30 గంటల వరకు తన మొదటి షాట్‌కు పిలవలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు వేచి చూసినా కూడా ఆమె “ముఖం మీద అందమైన చిరునవ్వు”తో కొనసాగింది తప్ప ఎక్కడ అసహనాన్ని వ్యక్తం చేయలేదు అని ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామందికి అర్థం అయింది.

ఒక యాక్టర్ ఎప్పుడూ కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అని ఒక ఆలోచనతో ఉంటారు. సినిమా సెట్ కు వచ్చి ఖాళీగా కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. బహుశా ఆ విషయంలో దీపిక కూడా హర్ట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని విషయాలు కరెక్ట్ అనిపిస్తుంది. బహుశా దీపిక వెర్షన్ లో అలా సెట్ కి పిలిపించి సాయంత్రం వరకు షాట్ పెట్టకపోవడం అనేది తనకు బాగా కోపం తెప్పించి ఉండొచ్చు.

Also Read: OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

Related News

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌.. ప్రముఖ జర్నలిస్ట్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌లో మంచు లక్ష్మి ఫిర్యాదు

VK Naresh: మళ్లీ పవిత్ర పేరు తీసుకొచ్చిన నరేష్.. ఆ ప్రేమ గుర్తొచ్చింది

K-Ramp Teaser Review : కంటెంట్ వదిలేసి మళ్లీ బిల్డప్ ను నమ్ముకున్నాడా?

Sadha Father: హీరోయిన్‌ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Jr NTR : షూటింగ్ స్పాట్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు

Big Stories

×