OTT Movie : ఎడారి బ్యాక్‌డ్రాప్ లో ఒక మలయాళం సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది ఒక సాధారణ రోడ్ ట్రిప్ తో మొదలై, క్రమంగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ముగుస్తుంది. రోడ్ థ్రిల్లర్స్, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం వన్-టైమ్ వాచ్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తలుసుకుందాం పదండి.
“Two Men” 2022లో విడుదలైన మలయాళ డ్రామా-థ్రిల్లర్ చిత్రం. దీనిని సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇర్షాద్ అలీ (సంజయ్ మీనన్), M.A. నిషాద్ (అబుక్కా), రంజి పణిక్కర్, బిను పప్పు, లీనా ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.6/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2022 ఆగస్టు 5న థియేటర్లలో విడుదలై, 2025సెప్టెంబర్ 19 నుంచి ManoramaMax ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, Saina Playలో కూడా అందుబాటులో ఉంది.
ఈ కథ UAEలో జరుగుతుంది. ఒక (బక్రీద్ పండుగ ) సమయంలో సంజయ్ మీనన్ అనే ఒక బిజినెస్‌మాన్, అబుక్కాఅనే 63 ఏళ్ల పికప్ డ్రైవర్ – ఊహించని విధంగా కలుస్తారు. సంజయ్ తన బిజినెస్ సామ్రాజ్యం కుప్పకూలడంతో భారీ అప్పుల్లో కూరుకుపోయి, డిప్రెషన్‌లో ఉంటాడు. అతని స్నేహితులు మదై శ్రీధరన్ (రంజి పణిక్కర్), సోనీ (మిథున్ రమేష్) కూడా ఈ కుప్పకూలిన బిజినెస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోవైపు, అబుక్కా, 35 ఏళ్లుగా UAEలో ఉంటూ, దుబాయ్‌లో నివసిస్తూ, 400 కి.మీ. దూరంలోని కంపెనీకి సరుకు రవాణా చేస్తుంటాడు. అతని చిన్న కూతురు వివాహం కోసం 5 లక్షల రూపాయలు అవసరం పడటంతో, అతను కూడా ఆర్థిక ఒత్తిడిలో ఉంటాడు. ఒక రోజు, అబుక్కా తన పికప్ వ్యాన్‌లో సంజయ్‌కు లిఫ్ట్ ఇస్తాడు. ఇక్కడ నుండి కథ రోడ్ ట్రిప్‌గా మారుతుంది.
ఈ జర్నీలో వీళ్లిద్దరూ తమ జీవిత కష్టాలను షేర్ చేసుకుంటూ, లైట్‌హార్టెడ్ బాంటర్, ఎమోషనల్ మూమెంట్స్ ద్వారా ఊహించని బంధాన్ని ఏర్పరుచుకుంటారు.సెకండ్ హాఫ్‌లో, కథ రోడ్ థ్రిల్లర్‌గా మారుతుంది. సంజయ్, అబుక్కా మధ్య సంభాషణలు వాళ్ల జీవితాల్లోని సమస్యలను బయటపెడతాయి. అబుక్కా తన కూతురి వివాహాన్ని కాపాడాలనే ఒత్తిడిలో ఉంటాడు. అయితే సంజయ్ తన బిజినెస్ ఫెయిల్యూర్, అప్పుల బాధలతో డీల్ చేస్తాడు. ఈ రోడ్ ట్రిప్‌లో ఊహించని ట్విస్ట్‌లు, ఒక థ్రిల్లింగ్ ఎన్‌కౌంటర్ వీళ్ల జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. వాళ్ల జీవితాల్లో వచ్చే మార్పు ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. వీళ్ళ జీవితాల్లో వచ్చిన ఆ మార్పు ఏమిటి ? రోడ్ ట్రిప్‌లో వచ్చే ట్విస్ట్‌లు ఎలా ఉంటాయి ? అనే విషయాలను,ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అమ్మాయిల కోసం అల్లాడిపోయే ఆటగాడు… యాప్ లో ఒకే ఒక్క క్లిక్ తో అరాచకం… యూత్ డోంట్ మిస్