India vs Oman: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా టీమిండియా వర్సెస్ ఒమన్ ( India vs Oman ) జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శుక్ర వారం జరిగిన ఈ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే విజయం సాధించింది టీమిండియా. దీంతో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ 189 పరుగుల టార్గెట్ పెట్టినా కూడా ఒమన్ ప్లేయర్లు చివరి వరకు పోరాడారు. కానీ చివరలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… ఒమన్ ఓడింది. ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
అబుదాబీలో జరిగిన టీమిండియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 189 పరుగుల టార్గెట్ ను ఒమన్ జట్టు ముందు ఉంచింది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఒమన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఒకానొక సమయంలో… ఒమన్ మ్యాచ్ గెలుస్తుందని అందరూ భయపడ్డారు. కానీ హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా , అర్ష్ దీప్ సింగ్ ముగ్గురు అద్భుతంగా బౌలింగ్ చివర్లో చేశారు. వరుసగా వికెట్లను తీయడంతో… టీమ్ ఇండియా విజయం సాధించింది. ఒమన్ జట్టులో ఖలీమ్, మిరజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ చివరి వరకు… నిలిస్తే ఒమన్ జట్టు విజయం సాధించేది. ఈ మ్యాచ్ లో ఖలీం 64 పరుగులు చేయగా… మీర్జా… 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. కానీ చివరికి… 20 ఓవర్లలో… నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడిపోయింది ఒమన్.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా టీమిండియా వర్సెస్ ఒమన్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగగా.. సూర్య కుమార్ యాదవ్ జట్టు అద్భుతంగానే రాణించింది. 200 లకు పైగా పరుగులు చేస్తుందని అందరూ అనుకుంటే… అక్కడి వరకు చేరుకోలేదు టీమిండియా. నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి.. 188 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, కీపర్ సంజూ శాంసన్ అద్భుతంగా రాణించడంతో.. టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లో 56 పరుగులు చేసి.. జట్టును సంజూ ఆదుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు సాధించాడు. అటు అభిషేక్ శర్మ 15 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 26 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 29 పరుగులు చేసి దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయలేదు.
Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్
SKY added the tag of Selfless leader and removed the tag of 'minnow basher'. All in a single game 🥵 pic.twitter.com/e1iEYi7fYB
— Dinda Academy (@academy_dinda) September 19, 2025