E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెద్ద సినిమాల్లో బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !

పెద్ద సినిమాల్లో  బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !
Advertisement

Deewana Controversy: సెన్సార్ బోర్డు తీరుపై ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతోంది. మొన్నటివరకు కేవలం పెద్ద సినిమాల విషయంలోనే వివాదాలు నడిచాయనుకుంటే, ఇప్పుడు చిన్న చిత్రాల రూపకర్తలు కూడా సెన్సార్ కత్తెరకు బలైపోతున్నారనేది తాజాగా వినిపిస్తున్నటాక్.

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఐదు కొత్త తెలుగు సినిమాలలో ఒకటైన ‘దీవానా’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లతో యాక్టివ్‌గా రన్ అవుతోంది. అంతకుముందు వచ్చిన ‘మా ఇంటి బంగారం’ లాంటి చిత్రాల సరసన నిలిచి  సక్సెస్‌ని అందుకుంటున్న ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు, విమర్శకులు కథ బాగుందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ సినిమా టీమ్ మాత్రం థియేటర్లలో నవ్వుతూ కనిపించడం లేదు, దానికి కారణం సెన్సార్ బోర్డు ఇచ్చిన షాకులు. తాజాగా జరిగిన చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు, సంగీత దర్శకుడు స్టేజ్ పైనే తమ అసహనాన్ని, ఆవేదనను వెళ్లగక్కడం సినిమా వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఒక రోజు ఆలస్యంగా వచ్చిన సినిమా 

ఈ సినిమా అసలు విడుదల కావడానికే ఒక రోజు లేట్ అయిందనే విషయం చాలామందికి తెలియదు. కేవలం ఈ సెన్సార్ వివాదాల వల్లే మేకర్స్ అనుకున్న డేట్ కంటే ఒక రోజు ఆలస్యంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. సినిమాలో ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, చిత్రానికి ప్రాణప్రదమైన ఒక సాంగ్‌ను పూర్తిగా తొలగించాలని సెన్సార్ అధికారులు ఆర్డర్ వేశారు.

Advertisement

చిత్ర యూనిట్ ఎంతో క్రియేటివ్ టచ్‌తో, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తీర్చిదిద్దిన ఆ సాంగ్‌ను లేపేయడం వల్ల సినిమా ఆత్మ దెబ్బతిందని వారు ఫీల్ అవుతున్నారు. సినిమా చూసిన సాధారణ ఆడియన్స్ కూడా అందులో అభ్యంతరకరమైన కంటెంట్ ఏమీ లేదని, అసలు దీనికి ‘A’ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరమే రాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుండటం గమనార్హం.

సినిమాని చూడలేకపోయిన ఫ్యామిలీ

ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఇండస్ట్రీలోని డబుల్ స్టాండర్డ్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో థియేటర్లలోకి వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో బూతులు, హింస, నగ్నత్వం వంటి అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నప్పటికీ వాటికి ఈజీగా ‘U/A’ సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

నెటిజన్లు సైతం సదరు పెద్ద సినిమాలపై ఇంటర్నెట్‌లో తీవ్రంగా ట్రోల్స్ చేసినా బోర్డు పట్టించుకోలేదని, కానీ తాము అన్ని గైడ్‌లైన్స్ పాటించి, వారు చెప్పిన కట్స్ అన్నీ ఒప్పుకున్నా కూడా తమకు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చి థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేశారని ఆవేదన చెందారు. తన సొంత కుటుంబంలోనే ఎనిమిది మంది కలిసి థియేటర్‌కు వెళ్తే, ఈ సర్టిఫికేట్ రూల్స్ వల్ల కేవలం ముగ్గురు మాత్రమే లోపలికి వెళ్లగలిగారని ఆయన ఉదాహరణతో సహా చెప్పుకొచ్చాడు.

మన సినిమాపై నార్త్ లాబీయింగ్ 

ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ సంగీశెట్టి అయితే స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ లేదా నార్త్ లాబీయింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో కూర్చున్న కొందరు వ్యక్తులకు తెలుగు సినిమా సాధిస్తున్న గ్లోబల్ పాపులారిటీ, ఇక్కడి ఇండస్ట్రీ డామినేషన్ అస్సలు జీర్ణం కావడం లేదని, అందుకే కావాలనే సౌత్ సినిమాలను, ముఖ్యంగా చిన్న మేకర్స్‌ను ఇలా టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తాను ఎంతో అద్భుతమైన విజువల్స్ తో, తన ఫ్యామిలీకి తన ప్రతిభను చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎస్తెటిక్‌గా డిజైన్ చేసిన సాంగ్‌ను కట్ చేయడమే కాకుండా, సినిమాకు అడల్ట్ ట్యాగ్ వేయడం దారుణమన్నారు.

కొన్ని నెలల క్రితం కూడా సెన్సార్ బోర్డు కొన్ని క్రేజీ సినిమాల టైటిల్స్ విషయంలో ఇలాగే లేనిపోని అభ్యంతరాలు వ్యక్తం చేసి వివాదాలకు తెరతీసిన సంగతి తెల్సిందే ఇప్పుడు కంటెంట్ స్క్రూటినీ పేరుతో మరింత కఠినంగా వ్యవహరిస్తూ చిన్న సినిమాల పీక నొక్కుతోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. హర్షిత్ రెడ్డి, స్నేహ జంటగా నటించిన ఈ ‘దీవానా’ చిత్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సెన్సార్ సెగలు టాలీవుడ్‌లో ఎలాంటి కొత్త చర్చలకు దారితీస్తాయో చూడాలి మరి.

Related News

రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సుధీర్‌తో సినిమా‌ వార్తలపై స్పందించిన రష్మి.. అంత మాట అనేసిందేంటీ?

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

‘రాజా సాబ్’ దెబ్బకి డార్లింగ్ రూట్ మార్చాడా? 2027లో ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర..

బాక్సాఫీస్ ‘పెద్ది’ అరాచకం.. 400 కోట్ల క్లబ్‌లో రామ్ చరణ్.. నేడే మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్ సక్సెస్ మీట్!

నారా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నారా వారి కోడలు..

Big Stories

×