E-Paper
Advertisement

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!
Advertisement

Samantha Pregnancy:సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన సామ్ ఇప్పుడు నిజజీవితంలో తల్లి పాత్ర వేయడానికి రెడీ అయిపోయింది. చైతుతో వివాహ బంధాన్ని తెంచుకున్న సామ్.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా నేను మదర్ కాబోతున్నానంటూ ప్రకటించిన సామ్ ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ టైమ్‌ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది.అంతేకాదండోయ్.. అమ్మగా మారేందుకు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతుందట కూడా.

తల్లిగా మారేందుకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్

Advertisement

ఇప్పుడు ఇదే విషయం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుతో అర్థమయిపోతుంది.‘ఆగస్ట్ ఎనర్జీ’ అంటూ సమంత పోస్ట్ చేసిన ఆ ఫోటోల్లోని ఒక ఫోటోలో సోఫాలో కూర్చుని ఒక పుస్తకం చదువుతూ కెమెరాకి పోజ్ ఇచ్చింది సామ్.

ఆ పుస్తకం పేరు ‘ఇనా మేస్ గైడ్ టు చైల్డ్‌బర్త్’. అంటే ఇప్పటినుంచే ప్రసవం, మాతృత్వం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట.మొత్తానికి పాప పుట్టడానికి ముందు ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ఇప్పటి నుంచే తెలుసుకుంటుందన్న మాట.

భర్త రాజ్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు కూడా షేర్

Advertisement

ఇక ఈ పోస్ట్‌లో ఒక్క సామ్ ఫోటోలు మాత్రమే కాదండోయ్.. తన భర్త రాజ్ నిడిమోరు బర్త్‌డే సెలబ్రేషన్‌కి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది సామ్.

ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత

ఇక సమంత ప్రెగ్నెన్సీ విషయానికొస్తే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.ఎట్టకేలకి ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో క్లారిటీ ఇవ్వడంతో మురిసిపోయారు ఫ్యాన్స్.

ఇక 2026 జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఆ ఈవెంట్‌లో సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని, ఆ తర్వాత మళ్లీ సినిమాల ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది.

‘మా ఇంటి బంగారం’తో సాలిడ్ కం బ్యాక్

ఇక ‘మా ఇంటి బంగారం’ విషయానికే వస్తే ఈ సినిమా సమంతకు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి.పైగా ఇందులో హీరోయిన్‌గా నటించడమే కాకుండా సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా.

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2026 జూన్ 19న వచ్చి ఏకంగా 100 కోట్లని వెనకేసింది.మొత్తానికి ప్రెగ్నెన్సీ కారణంగా సామ్ కొన్ని నెలల పాటు సినిమాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది అన్నమాట.

2025 డిసెంబర్‌లో పెళ్లి.. అప్పటినుంచి వైరల్

ఇక పెళ్లి విషయానికి వస్తే 2025 డిసెంబర్‌లో జరిగిన వీరి వివాహం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.అప్పటినుంచి వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.

ALSO READ:‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

డిసెంబర్‌లో బేబీకి జన్మనిస్తుందా?

ఇక సమంత డిసెంబర్‌లో బేబీకి జన్మనివ్వబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.చూడాలి మరి దీనిపై సమంత, రాజ్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందో!

Tags

Related News

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్

విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!

Big Stories

Advertisement
×