E-Paper
Advertisement

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?
Advertisement

Nayanthara Praises Yash: బెంగళూరులో టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యష్ ఫ్యాన్స్‌కు అయితే ఇది ఏకంగా పండగలా మారిపోయింది. టీజర్‌తోనే సినిమాపై భారీ హైప్ తెచ్చుకున్న టాక్సిక్ టీమ్.. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ అంచనాలను ఏకంగా ఆకాశంలో పెట్టేసింది. బెంగళూరులో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యష్‌తో పాటు సినిమాలో నటించిన తారలంతా సందడి చేశారు.

యష్‌పై నయన్ ప్రశంసల వర్షం

అయితే ఈ ఈవెంట్‌లో నయనతార చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యష్ గురించి ఆమె మాట్లాడిన మాటలు విన్న నెటిజన్లు.. అసలు ఈ హీరోను ఇంతలా పొగడాలా? అంటూ సరదాగా సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

నయనతార మాట్లాడుతూ.. ఇలాంటి నటుడిని తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పుకొచ్చింది. టాక్సిక్ సినిమా కోసం యష్ నాలుగున్నరేళ్లుగా ఎంతో కష్టపడ్డాడని, అతడి వర్క్ ఎథిక్స్ గురించి చాలామంది చెబుతుండేవారని తెలిపింది. అయితే యష్‌తో కలిసి పనిచేసిన తర్వాత అతడి వర్కింగ్ స్టైల్‌ను స్వయంగా చూసి మరింత ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.

సినిమా కోసం యష్ డెడికేషన్ చూసి షాక్

యష్ సినిమా కోసం పడే కష్టం చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుందని నయన్ చెప్పింది. ఒకసారి సినిమా పని మొదలుపెట్టాక అతడికి సినిమా తప్ప ఇంకేమీ కనిపించదన్నట్టుగా మాట్లాడింది. కుటుంబం, వ్యక్తిగత విషయాల కంటే సినిమా పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే రేంజ్‌లో యష్ డెడికేషన్‌ను నయనతార ప్రశంసించింది.

సెట్‌లో తొలిసారి చూసినప్పుడే

Advertisement

ఇక తొలిసారి టాక్సిక్ సెట్‌లోకి వెళ్లినప్పుడు యష్‌ను చూసిన విధానం గురించి కూడా నయనతార ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

KGFలో రాకీ భాయ్‌గా యష్ ఎలా కనిపించాడో.. తాను మొదటిసారి యష్‌ను టాక్సిక్ సెట్‌లో చూసినప్పుడు కూడా తనకు అలానే అనిపించిందని చెప్పింది. దీంతో యష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోయారు.

ఎందుకంటే యష్ పేరు చెప్పగానే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చేది రాకీ భాయ్ క్యారెక్టరే. అలాంటి పాత్రతో వచ్చిన ఇమేజ్‌ను నయన్ ఏకంగా నిజ జీవితంలో యష్‌ను చూసినప్పుడు కూడా ఫీల్ అయ్యానని చెప్పడంతో అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు రచ్చ అప్పుడే మొదలైంది.

హీరోహీరోయిన్లు పొగుడుకోవడం కొత్తేమీ కాదు!

ఎందుకంటే సినిమా ప్రమోషన్స్‌లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు పొగుడుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా కలిసి సినిమా చేసిన తర్వాత స్టేజ్ మీదకు వచ్చి.. ‘ఇలాంటి యాక్టర్‌ను చూడలేదు’, ‘ఇంత డెడికేషన్ ఎవర్లోనూ చూడలేదు’, ‘ఇతనితో కలిసి పనిచేయడం నా అదృష్టం’ అంటూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడం చాలాసార్లు చూస్తూనే ఉంటాం.

ఇదిగో ఇప్పుడు నెటిజన్లు కూడా ఇదే పాయింట్‌ను పట్టుకున్నారు.

“మళ్లీ మొదలుపెట్టారా?” అంటూ ట్రోల్స్

“అమ్మో.. మళ్లీ మొదలుపెట్టారా?” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. “ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష హీరోని ఆకాశానికి ఎత్తేయడం సెలబ్రిటీలకు అలవాటే కదా!” అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

అయితే నయనతారకు సపోర్ట్ చేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.

KGF తర్వాత యష్ ఏకంగా నాలుగేళ్లకు పైగా ఒకే ప్రాజెక్ట్‌పై పనిచేయడం చిన్న విషయం కాదని వాళ్లు అంటున్నారు. ఒక స్టార్ హీరో ఇంత కాలం మరో సినిమా చేయకుండా ఒకే ప్రాజెక్ట్ కోసం కష్టపడటం నిజంగానే డెడికేషన్‌కు నిదర్శనమని నయన్ చెప్పిన మాటలను సమర్థిస్తున్నారు.

అంటే నయన్ చెప్పింది కేవలం ప్రమోషనల్ డైలాగ్ కాదని.. యష్ వర్కింగ్ స్టైల్‌ను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆమె తన అనుభవాన్ని చెప్పిందని అంటున్నారు.

ALSO READ:వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

ఆగస్టు 26న యష్ ఎలాంటి సమాధానం ఇస్తాడో !

ఏది ఏమైనా  యష్ ఎంత కష్టపడ్డాడు? నయనతార ఎంత పొగిడింది? సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ట్రైలర్ ఎంత పెద్దగా ఉంది? ఇవన్నీ ఒక ఎత్తు. చివరికి థియేటర్‌లో ప్రేక్షకుడు ఏమంటాడు అనేదే అసలు మ్యాటర్.చూడాలి మరి ఆగస్టు 26న యష్ ఎలాంటి సమాధానం ఇస్తాడో !

 

Tags

Related News

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×