Toxic Trailer:‘కేజీఎఫ్’ 2… తొలిసారి కన్నడ ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల వసూళ్లని రుచి చూపించిన సినిమా. ఇక ఆ సినిమా తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి మరో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయి. అదుగో అలాంటి భారీ అంచనాలే మోసుకుంటూ వచ్చేస్తుంది టాక్సిక్. ఇక ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండటంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదన్న విషయం తెలిసిపోయింది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరులో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘టాక్సిక్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ చూస్తుంటే మొదటి నుంచి చివరి వరకు యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా యష్ లుక్, యాటిట్యూడ్, యాక్షన్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమనేలా ఉంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌గా చూసిన యష్‌ను మళ్లీ అదే తరహాలో చూడాలని అనుకునే వాళ్లకు మాత్రం ఈ ట్రైలర్ మంచి కిక్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ట్రైలర్ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా తెలుస్తోంది. ‘టాక్సిక్’ను ‘కేజీఎఫ్’కు మరో పార్ట్‌లా కాకుండా పూర్తిగా కొత్త ప్రపంచంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. డార్క్ బ్యాక్‌డ్రాప్, క్రైమ్, గన్స్, యాక్షన్, పవర్ గేమ్.. వీటన్నింటి మధ్య యష్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించిన తీరు ఫ్యాన్స్‌కి మంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.
అసలు ఈ హీరో ఎవరు? అతని కథ ఏంటి? ఇంత పవర్‌ఫుల్‌గా ఎందుకు మారాడు? అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యేలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్.
ముఖ్యంగా ఒక దగ్గర“మనిద్దరం పద్ధతిగా మాట్లాడుకుందాం అనుకున్నా” అని విలన్ చెప్పగానే..యష్“నేను నీకు పద్ధతిగా ఉన్నవాడిలా కనిపిస్తున్నానా?” అని ఇచ్చే ఆన్సర్ అదిరిపోయింది.ఈ డైలాగ్‌కి థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం.
మొత్తానికి 4 నిమిషాల 39 సెకన్ల ట్రైలర్ అయినా ఎక్కడా పెద్దగా బోర్ కొట్టలేదు. సినిమా చాలా డార్క్‌గా, యాక్షన్‌తో నిండిపోయి ఉండబోతుందని మాత్రం అర్థమవుతోంది.
ఇక అన్నింటికన్నా మించి గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం ‘టాక్సిక్’కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు చూస్తే కథను కాస్త డిఫరెంట్‌గా చెప్పడంలో ఆమెకు మంచి పట్టు ఉందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.
అలాంటి దర్శకురాలు యష్ లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‌తో పాటు కథలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది.
ఇక యష్‌తో పాటు సినిమాలో భారీ స్టార్ కాస్ట్ కూడా ఉందండోయ్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ట్రైలర్‌లో వీళ్ల క్యారెక్టర్స్‌కు సంబంధించిన కొన్ని షాట్స్ కూడా చూపించారు. అయితే అసలు వీళ్ల పాత్రలు ఏంటి? యష్ క్యారెక్టర్‌తో వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టడం ఇక్కడ గమనార్హం.
ఇక ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఒక్కో యాక్షన్ బ్లాక్ చూస్తుంటే సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. యష్ ఎంట్రీ దగ్గర నుంచి యాక్షన్ సీన్స్ వరకు అన్నింటినీ చాలా స్టైలిష్‌గా చూపించారు.
ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలం ఇచ్చిందని చెప్పాలి. ‘కేజీఎఫ్’కు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించడంతో బీజీఎంపై ఫ్యాన్స్‌లో ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
‘టాక్సిక్’ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. మొదట 2025 ఏప్రిల్ 10న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2026 మార్చి 19కి మార్చారు. తర్వాత జూన్ 4కి వెళ్లింది. చివరకు ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు.
రిలీజ్ డేట్ మారుతూ రావడంతో సినిమాపై రకరకాల వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ రావడంతో ఆ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పడినట్టే.
‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో నార్మల్‌గానే ‘టాక్సిక్’పై భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’తో యష్‌కు పాన్ ఇండియా మార్కెట్‌లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత ‘టాక్సిక్’ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మరోవైపు సినిమా టైటిల్ కూడా మొదటి నుంచి క్యూరియాసిటీ పెంచుతోంది. ‘టాక్సిక్’ అనే పేరే చాలా డిఫరెంట్‌గా ఉండటంతో అసలు కథ ఏంటి? హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఆడియన్స్‌లో సినిమా చూసెయ్యాలన్న క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
మొత్తానికి ఇన్ని రోజులు వెయిట్ చేయించిన ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేసింది. యష్ ఫ్యాన్స్‌కు అయితే ఇది ఫుల్ మీల్స్ లాంటిదే. యష్ లుక్, యాక్షన్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్, భారీ విజువల్స్, రవి బస్రూర్ మ్యూజిక్ అన్నీ కలిసి ట్రైలర్‌కు మంచి హైప్ తీసుకొచ్చాయి.
ఇప్పటివరకు ట్రైలర్ చూస్తే మాత్రం ‘టాక్సిక్’పై అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.
ఇక ఈ ఆగస్టు 26 నుంచి ఆట మొదలవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన హైప్‌ను సినిమా కూడా అందుకుంటే యష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర పెద్ద రచ్చ చేయడం ఖాయమే. ‘కేజీఎఫ్’తో ఇండియన్ బాక్సాఫీస్‌కు తన రేంజ్ ఏంటో చూపించిన యష్.. ‘టాక్సిక్’తో ఇంకెంత దూరం వెళ్తాడో చూడాలి.