E-Paper
Advertisement

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!
Advertisement

Mrunal thakur: ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అద్భుతమైన యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొట్టేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా డేటింగ్ రూమర్స్ తోనే వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమె ప్రమేయం లేకపోయినా ఈమెపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. ఈమెను ఇబ్బందులు పెట్టేస్తోంది. ఇప్పటికే ధనుష్ (Dhanush ) తో ప్రేమా, పెళ్లి అంటూ రూమర్లు రాగా వాటికి చెక్ పెట్టినా.. మరోసారి ప్రముఖ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) తో డేటింగ్ లో ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఆ నోట ఈ నోట పడి చివరికి ఈ వార్తలు మృణాల్ వరకు చేరడంతో ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

యశస్వి జైస్వాల్ తో డేటింగ్.. స్పందించిన మృణాల్ ఠాగూర్..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యశస్వితో మృణాల్ డేటింగ్ లో ఉందంటూ వార్తలు రావడంతో ఆమె చివరికి స్పందించింది. యశస్వి తో మృణాల్ ను లింక్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ పై ఘాటుగా స్పందించింది. “నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. అసలు నా పక్కన యశస్వి ఎక్కడ ఉన్నాడో చూపించండి.చదువుకున్న వారు కూడా ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ఎలా నమ్ముతారో నాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా అందరూ చదువుకున్న వారే కదా.. ఆ మాత్రం తెలియదా? దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. వాటిపై దృష్టి పెట్టకుండా ఇలాంటి చిల్లర వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు” అంటూ ఆమె సూచించారు. మొత్తానికి అయితే యశస్వితో మృణాల్ డేటింగ్ చేస్తోంది అన్న వార్తలకు ఆమె ఒక్కసారిగా చెక్ పెట్టారు.

Advertisement

also read:మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!

అసలేం జరిగిందంటే?

అసలు ఈ పుకార్లు పుట్టుకు రావడానికి కారణం ఏంటి? అనే విషయానికొస్తే ఇటీవల ముంబై లోనే బాంద్రా ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి మృణాల్ ఠాకూర్ , యశస్వి జైస్వాల్ వేరువేరు సమయాలలో బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ నెటిజన్స్ ఊహాగానాలు మొదలుపెట్టారు. నిజానికి ఇద్దరు కలిసి కనిపించకపోయినా.. ఒకే ప్రాంతంలో కనిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి అయితే మృణాల్ ఠాకూర్ ఈ వార్తలపై స్పందించి చెక్ పెట్టింది.

గతంలో ధనుష్ తో కూడా ఇలాంటి వార్తలు..

Advertisement

ఇకపోతే గతంలో కూడా ధనుష్ తో మృణాల్ ఠాకూర్ ఇలాంటి వార్తలని ఎదుర్కొంది. ముఖ్యంగా ధనుష్ సోదరితో ఆమె క్లోజ్ గా ఉండడం.. మృణాల్ మూవీ ఈవెంట్ కి ధనుష్ వెళ్లడంతోనే ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా తన సినిమాల కంటే కూడా ఇలా డేటింగ్ రూమర్స్ తోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది మృణాల్ ఠాకూర్.

Related News

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్

విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!

ప్రమోషన్స్‌కి డబ్బులు తగలేయడం దండగే.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×