BRS: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయా? బీఆర్ఎస్ శ్రేణులు టీవీ కార్యాలయంపై ఎందుకు దాడులు చేసింది? కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందా? ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంలో తగ్గేది లేదని ఎందుకంటోంది? టీవీ కార్యాలయంపై చేసిన దాడితో బీఆర్ఎస్ ప్రతిష్ఠ మసక బారిందా? అవుననే అంటున్నాయి గులాబీ శ్రేణులు.
టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి మరొక ట్వీట్ చేసింది. ‘ఆనాడైనా… ఈనాడైనా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంలో తగ్గేదే లేదు! మీ పోలీసులకి, జైళ్ళకి, మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ! పోరాటం తెలంగాణ రక్తంలో ఉంది! ఈట్ కా జవాబు పత్తర్ సే జరూర్ లేంగే!’ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది.
ఉన్నట్లుండి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా చేయడాన్ని చాలామంది రాజకీయ నేతలు జీర్ణించుకోలేకపోయారు. బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేసిందని ఆలోచనలో పడ్డారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, ఆ మాత్రం దానికి ఆవేశానికి లోనైతే దాడులు చేయడం సరికాదని అంటున్నారు.
‘ఆఫ్ ద రికార్డు’లో కారు పార్టీలోని కొందరు నేతలు కొన్ని విషయాలు బయటపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినా, బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఆ ఛానెల్ వార్తలు ప్రచారం చేసిందని అంటున్నారు. సానుకూలంగా ఉన్న ఛానెల్‌పై దాడి చేయడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు.
ALSO READ: తెలంగాణ బీజేపీకి కొత్త సారథి.. ఆ ఇద్దరిలో ఒకరికే ఛాన్స్
ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు ఊహాజనితంగా వార్తలు రాస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. శ్రేణుల దాడితో ఆ పార్టీకి ఉన్న ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యిందని చర్చించు కుంటున్నారు. అధికారం పోయిన తర్వాత ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలాగే ఉంటుందన్నది మరికొందరి మాట.
బీఆర్ఎస్ కేడర్ చేసిన దాడిని చాలామంది నేతలు తప్పుబడుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపై పడుతుందని అంటున్నారు. ఉన్నట్లుండి దాదాపు పదేళ్ల తర్వాత టీవీ కార్యాలయంపై దాడి చేయడాన్ని పారిశ్రామిక వేత్తలు తలో విధంగా చర్చించుకోవడం మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ తయారవుతుందని భావిస్తున్న సమయంలో దాడులు మంచిది కాదని అంటున్నారు.
దేశీయంగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. దాడి ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం పడకుండా చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహా న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతరాత్రి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దాడి వెనుక ఏం జరిగింది అనే విషయాలు బయటకు వస్తాయా? లేదో చూడాలి.
ఆనాడైనా… ఈనాడైనా
ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంలో తగ్గేదే లేదు!మీ పోలీసులకి, జైళ్ళకి, మీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ!
పోరాటం తెలంగాణ రక్తంలో ఉంది!
ఈట్ కా జవాబు పత్తర్ సే జరూర్ లేంగే!అయ్యా @TelanganaDGP గారు!
పిచ్చి రాతలు రాసి, వెకిలి కూతలు కూసి,…— BRS Party (@BRSparty) June 29, 2025