Tamannaah: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది తమన్నా (Tamannaah ) ‘శ్రీ’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..’హ్యాపీడేస్’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun), మహేష్ బాబు (Maheshbabu), ఎన్టీఆర్ (NTR) వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ల హవా కాస్త తగ్గింది అని చెప్పాలి. ఇక అందులో భాగంగానే టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇటు కెరియర్ పరంగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అప్పుడప్పుడు ‘ఓదెల 2’ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. గత కొంతకాలంగా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ (Vijay Varma) కు బ్రేకప్ చెప్పింది అని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యక్షంగా స్పందించలేదు. కానీ దాదాపుగా ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని స్పష్టం అవుతోంది .అటు విజయ్ వర్మ కూడా ‘దంగల్ ‘ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaikh) తో తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తమన్నా..
సాధారణంగా ఎప్పుడూ సన్నగా కరెంట్ తీగలా కనిపిస్తూ తన అందాలతో అందరినీ అబ్బురపరిచే తమన్న తాజాగా బరువు పెరిగిపోయి కనిపించింది. ముఖ్యంగా బ్యాక్ బాగా పెంచేసినట్టు ఆ వీడియోలో చూడవచ్చు. ఇకపోతే ఇలా బాగా బరువు పెరిగిపోయినట్టు కనిపించడంతో నేటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. విజయ్ బాగా వాడుకొని వదిలేసాడా అంటూ కొంతమంది ఘోరంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇలాంటివి ఏఐ ద్వారా వీడియోలు సృష్టిస్తున్నారు అని మాత్రం స్పష్టం అవుతుంది..
వీడియో పై నెటిజన్స్ ఫైర్..
మొన్నటికి మొన్న ప్రెగ్నెంట్ అన్నట్టు చూపించిన వారు ఇప్పుడు బ్యాక్ బాగా పెంచేసి వీడియో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేసి స్టార్ హీరోయిన్ల పరువు ఎందుకు తీస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే తమన్నాకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
తమన్నా కెరియర్..
ఇక తమన్నా విషయానికి వస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తోంది. కానీ సరైన సక్సెస్ మాత్రం ఈమె ఖాతాలో పడలేదు. ఇటీవల ఓదెల సీక్వెల్ గా వచ్చిన ఓదెల 2 లో తొలిసారి అఘోరీ పాత్ర పోషించింది. కానీ ఈ పాత్ర కూడా పెద్దగా ఈమెకు వర్క్ అవుట్ కాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఇప్పటికైనా ఈమె కెరియర్ లో ఒక స్ట్రాంగ్ హిట్ పడుతుందేమో చూడాలి.
ALSO READ:Prakash Raj: పవన్ కళ్యాణ్ పిరికివాడు.. వాళ్లు లేకపోతే ఆయన బ్రతుకెక్కడ?
?utm_source=ig_web_copy_link