E-Paper
Advertisement

కుర్చీ కోసం ఎవరి గేమ్ వాళ్లదే! రచ్చ లేపుతున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్!

కుర్చీ కోసం ఎవరి గేమ్ వాళ్లదే! రచ్చ లేపుతున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్!
Advertisement

Dharmasthala Niyojakavargam Trailer Review: టాలీవుడ్‌లో పొలిటికల్ డ్రామాలకు ఎప్పుడూ ఉండే క్రేజే వేరని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.లీడర్, ప్రస్థానం నుంచి ఇటీవలి పొలిటికల్ థ్రిల్లర్స్ వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించినవే సరిగ్గా ఇదే బాటలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ సినిమా “ధర్మస్థల నియోజకవర్గం”.

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అసలు ట్రైలర్ ఎలా ఉందంటే?

Advertisement

రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. “అధికారం అంటే పీఠం కాదు… జనం నమ్మకం!” అనే తరహాలో ఉండే డైలాగ్స్, పొలిటికల్ లీడర్స్ మధ్య సాగే వ్యూహ ప్రతివ్యూహాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి. నియోజకవర్గంలో రాజకీయం ఎంత దారుణంగా మారుతుంది? ఆ సీటు కోసం ఎవరెన్ని ఎత్తులు వేశారు? అనే పాయింట్‌ను దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట చాలా రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

 నటీనటుల ఎంపికే పెద్ద ప్లస్ పాయింట్

సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ  నటనతో సీన్లను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. ముఖ్యంగా సాయికుమార్ గంభీరమైన గొంతు, ఆయన చెప్పిన పొలిటికల్ పంచ్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.ఇక నటరాజ్, రాయంచ కొక్కుర  క్యారెక్టర్లు కథలో చాలా కీలకంగా మారనున్నాయట. బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు ఈ పొలిటికల్ డ్రామాలో ఒక పవర్‌ఫుల్ అండ్ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతోంది. ట్రైలర్‌లో ఆమె లుక్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయనడం లో ఆశ్చర్యం లేదు.

పొలిటికల్ జోనర్‌లో మరో సంచలనం కానుందా?

Advertisement

తెలుగులో గతంలో వచ్చిన ‘ప్రస్థానం’లానే  “ధర్మస్థల నియోజకవర్గం” కూడా కంటెంట్ ఆధారంగా సాగే సీరియస్ డ్రామాగా రాబోతోంది. కేవలం రాజకీయాలే కాకుండా, దాని వెనుక ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతోంది.

సెప్టెంబర్ 4న థియేటర్లలో రచ్చ!

మేరుం భాస్కర్ నిర్మాణ విలువలు ట్రైలర్‌లో చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేశాయి. పొలిటికల్ థ్రిల్లర్స్, మాస్ ఎంటర్‌టైనర్స్‌నిష్టపడే వారికి ఈ సినిమా ఒక గుడ్ ట్రీట్ కానుంది. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ “ధర్మస్థల నియోజకవర్గం” బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి!

Tags

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×