E-Paper
Advertisement

రూ. 300 కోట్ల రికార్డుకు ఎసరు పెట్టిన ‘బెత్లెహెం’

రూ. 300 కోట్ల రికార్డుకు ఎసరు పెట్టిన ‘బెత్లెహెం’
Advertisement

Bethlehem Kudumba:‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit)..మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా ఇది. అవును .. ఈ మధ్యే రిలీజ్ అయి  బాక్సాఫీస్ దుమ్ము రేపుతుంది.. థియేటర్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, ఇప్పుడు సరికొత్త ‘మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్’ రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మెచ్చుకోవడం విశేషం.

రెండో వీకెండ్‌లో మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్!

సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వారంలో ఉన్నంత జోరు రెండో వారానికి వచ్చేసరికి కాస్త తగ్గుతుందన్న సంగతి తెల్సిందే. కానీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది.మొదటి వీకెండ్ కంటే రెండో వీకెండ్‌లోనే కలెక్షన్లు మరింత పెరగడం విశేషం. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే కామెడీ, పాత్రల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయనడం లో సందేహం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

‘లోక’ రికార్డుకు ఎసరు

Advertisement

ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ‘లోక’ (Lokah) మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పటివరకు ఉన్న కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ చాలా సులువుగా ఆ రూ. 300 కోట్ల మార్కును దాటేసి, కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు, తమిళ వర్షన్లతో మరో లెవల్

మలయాళంలో వచ్చిన ఈ  స్పందనతో మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. వచ్చే వారం విడుదల కానున్న ఈ డబ్బింగ్ వర్షన్లపై రెండు పరిశ్రమల్లోనూ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. మన తెలుగు ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు అంటే ఎలా నెత్తిన పెట్టుకుంటారో ఇప్పటికే బోలెడు సినిమాలు ప్రూవ్ చేశాయి.గతంలో వచ్చిన మలయాళ డబ్బింగ్ సినిమాలు ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ప్రేమలు’ లేదా ఎమోషనల్ రైడ్ ‘దృశ్యం’ చిత్రాలను మనవాళ్లు ఎంతలా ఆదరించారో తెలిసిందే.

Advertisement

అలాగే, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కూడా తెలుగు, తమిళ భాషల్లో కనెక్ట్ అయితే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఈ రెండు రాష్ట్రాల వసూళ్లతో కలిపి ‘లోక’ సెట్ చేసిన  రూ. 300 కోట్ల ఆల్‌టైమ్ రికార్డును తిరగరాయడం చాలా ఈజీ అంటూ లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

also read :పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే.. శోభాశెట్టి చెప్పిన అసలు కారణం ఇదే!

ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్

మంచి కథ, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా గుర్తుండిపోయే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.ఫ్యామిలీ మొత్తం చాలా రేర్ అయిన ఈ రోజుల్లో ఈ సినిమా రావడం విశేషం.చూడాలి డబ్బింగ్ వెర్షన్స్ వస్తే కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్ లో దూసుకుపోతాయో !

Tags

Related News

ఇరుముడి దెబ్బకు రవితేజ పాత రికార్డులన్నీ గల్లంతే!

బాలయ్య vs నాగ్.. పాత లెక్కలేంటి? ఈసారి గెలుపెవరిది?

ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

సూరికి హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?

నా బిడ్డకు మీరే పేరు పెట్టండి… ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన సమంత!

కాకా కథ ఇదేనా …మెగా 158 స్టోరీ లీక్ ?

కోర్టు ఫేం హర్ష రోషన్ “తెల్ల కాగితం” రిలీజ్ డేట్ ఫిక్స్..ఇలా కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×