E-Paper
Advertisement

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Dheeraj Mogilineni:టాలీవుడ్ లో పెద్ద సినిమాల కుండే క్రేజే వేరు .అది ఈ మధ్య మరీ ఎక్కువైందని చెప్పాలి.అయితే ఈ బడా సినిమాల మధ్యన చిన్న సినిమాలు నిలబడటానికి ఇపుడు నిలబడటానికి చిన్న సినిమాలు పెద్ద యుద్దమే చేస్తున్నాయి.ముఖ్యంగా మంచి స్టోరీస్ తో సినిమా తీసినప్పటికీ సరైన థియేటర్స్ దొరక్క,అనుకున్న రిలీజ్ డేట్స్ మారిపోతూ ఉండటంతో చిన్న నిర్మాతలు బాగా ఇబ్బందుల పాలు అవుతున్నారు.ఇదిగో ఇలాంటి పరిస్థితులపై నిర్మాత ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదిగో తన అభిప్రాయాలని ఇలా చెప్పుకొచ్చాడు.

డబ్బు కోసమే సినిమాలు తీయడం లేదు

Advertisement

సినిమా ప్రొడ్యూసర్ గా ఎందుకు మారారు అనే ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ డబ్బు సంపాదించే ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి రాలేదని,అదే టార్గెట్ అయితే తన తండ్రి బిజినెస్ చూసుకున్నా,లేక కొత్త బిజినెస్ పెట్టిన,లేకపోతే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని కాని తనకి సినిమాల పై ప్రేమ ఉండటం వల్లే ఇలా నిర్మాతగా మారానని తెలిపాడు.ఇక తన బ్యానర్ పై ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ చూడటానికి ఈగర్ గా వెయిట్ చేయాలని చెప్పుకొచ్చాడు.అయితే సినిమాలలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువుంటాయని,సినిమా పెద్ద హిట్ అయినా నిర్మాతకి పెద్దగా ఏం మిగలట్లేదని,సినిమాపై ఏడాది,రెండేళ్ళు పని చేసినప్పటిక అనుకున్నంత స్థాయిలో లాభాలు రావని వాపోయాడు.

రూ.100 కోట్ల బడ్జెట్ ఉన్నా..

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో ధీరజ్ మాట్లాడుతూ తనకి ఫ్యూచర్ ల తనకు వందల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం వచ్చినా, వందల కోట్ల బడ్జెట్‌తోనే సినిమాలు నిర్మించాలనే ఆలోచన లేదని,ఒకవేళ తన దగ్గర రూ.100 కోట్లు ఉంటే పెద్ద సినిమాని తీసే బదులు నాలుగు చిన్న సినిమాలు మనసులోని మాటని బయటపెట్టాడు.పెద్ద సినిమా గనుక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే మొతం పోతుందని,అదే ఆ బడ్జెట్ తో ఒక నాలుగు సినిమాలు చేస్తే అటు లాస్ రికవరీతో పాటు కొత్తకొత్త టాలెంటెడ్ టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయొచ్చని తెలిపాడు.

ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలని చూస్తే సంతోషంగా ఉందని, వాళ్ళు స్టార్స్ అవ్వకముందే వారితో తన జర్నీ మొదలైందని గుర్తు చేసుకున్నాడు.ఇక ఇప్పటికే స్టార్స్ అయిన వారితో సినిమాలు చేయడాన్ని తాను వ్యతిరేకించట్లేదని అయితే ఫ్యూచర్ లో స్టార్స్ గా ఎదిగే వారిని గుర్తించి సినిమాలు చేయడమే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు.

చిన్న సినిమాలకు థియేటర్లు

ఇక చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న మరో ప్రాబ్లం థియేటర్స్ అని, సినిమా బాగున్నా ప్రేక్షకుల వరకు చేరడానికి కొంచెం టైం కావాలని కానీ చిన్న సినిమాలకు ఆ టైం కూడా దొరకట్లేదని వాపోయాడు. ఒక సినిమా శుక్రవారం రిలీజ్ అయితే అటు మీడియా రిపోర్టర్స్ కాని ఇటు ఆడియన్స్ కానీ ఆ మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేయడానికి కనీసం రెండు మూడు రోజులైనా పడుతుందని,కానీ ఇక్కడ అంత ఓపికలు ఎవరికి లేవని తెలిపాడు.ఇక సినిమా రిలీజ్ అయ్యాక మొదటి మూడు రోజుల్లో కలెక్షన్లు అనుకున్నట్టుగా లేకపోతె నాలుగో రోజు ఆ సినిమా థియేటర్ ల ఉండదని ఆవేదన బయటపెట్టాడు.

పెద్ద హీరోల సినిమాలకు ప్రేక్షకుల్లో ముందే క్యూరియాసిటీ ఉంటుంది ,కాని చిన్న సినిమాలకి ఆడియన్స్ లో క్రేజ్ రావాలంటే మరికొన్ని రోజులు సినిమా థియేటర్ లో ఉండాలని తెలిపాడు.ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో చిన్న సినిమాలకు షోలు తగ్గించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలని చూసే అవకాశం తగ్గిపోతుందని తన అభిప్రాయాన్నితెలిపాడు.అంతే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న సినిమాలకు వెళ్లాలంటే థియేటర్స్ వారికి అనుకూలంగా ఉండేలా ఉంటె బాగుంటుందని వివరించాడు.

‘సమ్మర్ హాలిడేస్’ బడ్జెట్ ఎంతంటే?

ఇక తాను నిర్మించిన ‘సమ్మర్ హాలిడేస్’ గురించి మాట్లాడుతూ సినిమాని 50 రోజుల వర్కింగ్ డేట్స్ తో దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో తీశామని ఇక ఈ సినిమా ott రైట్స్ కూడా అప్పుడే అయిపోయాయని,థియేటర్స్ లో మిగతాది రాబట్టుకోవడమే ఇపుడు కష్టంగా ఉందని తెలిపాడు.మొత్తంగా పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీకి అవసరమే అంటున్న ధీరజ్ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ :గాజులు గలగల పాట కోసం రాధమ్మ కూతురు ఎంత తీసుకుందో తెలుసా?

Tags

Related News

నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!

కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

Big Stories

Advertisement
×